వైయస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్న టైంలో చంద్రబాబు ప్రభుత్వం పై అనేక అవినీతి ఆరోపణలు చేయడం అందరికీ తెలిసిందే. జగన్ చేసిన అవినీతి ఆరోపణల లో  ఎక్కువగా చంద్రబాబు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ను అడ్డంపెట్టుకుని భయంకరంగా అవినీతి సొమ్ము సంపాదిస్తోంది అని తన బినామీలకు కాంట్రాక్టులు అప్పజెప్పడం జరిగిందని అనేక ఆరోపణలు చేశారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన ప్రతి అవినీతిపై పై ఓ ప్రత్యేకమైన కమిటీని వేసి నివేదికను కూడా తెప్పించుకోవడం జరిగింది. ఈ తరుణంలో పోలవరం ప్రాజెక్టు విషయంలో అవినీతి జరిగిందని ఓ మాజీ ఐఏఎస్ ఆధ్వర్యంలో కమిటీ వేసి నివేదిక తెప్పించుకుని దానిని కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది.

 

ఇదిలా ఉండగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిధులు ఇవ్వాలని పంపించాలని కేంద్రానికి ఇటీవల జగన్ లేఖ రాసినప్పుడు పోలవరం లో  అవినీతి జరిగింది అని ఆరోపణలు చేశారు కదా, వాటికి సంబంధించిన ఆధారాలు పంపించాలని ఆ తర్వాతే నిధులు విడుదల అవుతాయని తెలపడం జరిగిందట. అయితే ఆధారాలకు సంబంధించి ఎటువంటివి స్పష్టమైనవి లేకపోవడంతో ఏపీ సర్కార్ ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇదే విషయంలో హైకోర్టు లో పోలవరం ప్రాజెక్టు లో అవినీతి జరిగిందని ఓ వ్యక్తి పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ ను  కొట్టివేసిన హైకోర్టు...దానిని ఫిర్యాదుగా కేంద్ర జల శక్తి కి పంపించడం జరిగింది.

 

అయితే కేంద్ర జల శక్తి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి అవినీతి కార్యక్రమాలు జరగలేదని అన్నీ నిబంధనలకు అనుగుణంగానే నిర్మాణ పనులు జరిగినట్లు సదరు పిటిషనర్ కి లేఖ రూపంలో సమాధానం ఇవ్వటం జరిగింది. దీంతో పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు కి చుక్కలు చూపెట్టలని జగన్ వేసిన ప్లాన్ కి ఆయన చేతులు కట్టేసినట్లు కేంద్రం వ్యవహరించినట్లు అయ్యింది అని తాజా పరిణామాలపై చాలామంది అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: