ఏపీ అధికార పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మిగతా విషయాలు ఎలా ఉన్నా, మంత్రి పదవుల అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. చాలా కాలంగా జగన్ తన మంత్రి మండలిని ప్రక్షాళన చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడంతో మరికొద్ది రోజుల్లోనే వారు తమ పదవులకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వారి స్థానంలో బీసీ సామాజికవర్గానికి చెందిన వారిని మంత్రులుగా తీసుకోవాలని జగన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా, మరోమరో రెండు మంత్రి పదవులను కూడా జగన్ భర్తీ చేయాలని చూస్తున్నారు.

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=100 DAYS' target='_blank' title='100 days-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>100 days</a> in <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=OFFICE' target='_blank' title='office-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>office</a> leaves some happy, others ...


ఆ పదవుల్లో తనకు అత్యంత సన్నిహితులైన వారిని నియమించాలనే అభిప్రాయంతో జగన్ ఉన్నారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది  అనేక విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, వారి స్థానంలో కొత్త వారిని తీసుకోవాలి అనేది జగన్ ప్లాన్ గా తెలుస్తోంది. ఏడాది కాలంగా మంత్రుల పనితీరు పై జగన్ రిపోర్ట్ తెప్పించుకున్నట్లు సమాచారం. ఆ రిపోర్టు ఆధారంగా పని తీరు సక్రమంగా లేని వారిని తప్పించి, వారి స్థానంలో కొత్త వారిని నియమించాలనే ఆలోచనలో జగన్ ఉన్నారట. ఆయన రిపోర్ట్ ప్రకారం ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు మంత్రుల పనితీరు సంతృప్తికరంగా లేదని, వారు ఉన్నా, పార్టీకి ప్రభుత్వానికి, పెద్దగా ఉపయోగం లేదనే అభిప్రాయంతో, జగన్ ఉన్నారట. 

 

ప్రస్తుతం ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి నలుగురు మంత్రులుగా ఉన్నారు. దీంతో కాబోయే ఇద్దరు మంత్రులు ఎవరు అనే విషయంపై ఇప్పుడు వైసీపీ లో పెద్ద చర్చే నడుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్ పేర్లు తెరపైకి వస్తున్నాయి.  కృష్ణ దాస్ స్థానంలో ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావును తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. కాకపోతే ఈ విషయంలో జగన్ నిర్ణయం ఏంటి అనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియడంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: