వైసిపి రెబల్ ఎంపీ రఘు రామకృష్ణంరాజు వ్యవహారాన్ని ఆ పార్టీ చాలా సీరియస్ గానే తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో అయినా ఆయనపై అనర్హత వేటు వేయాలనే విధంగా పావులు కదుపుతోంది. మొదట్లో రఘురామ కృష్ణంరాజు పార్టీ పైన, అధినేత జగన్ పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేసినా, ఆ తర్వాత వైసిపి తనపై అనర్హత వేటు వేయించేందుకు సిద్ధమౌతోందన్న వార్తలతో ఆయన కాస్త వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తున్నారు. అయినా వైసీపీ మాత్రం ఆయన విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఈమేరకు వైసీపీ ఎంపీ బాలశౌరి ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతూ, ఇప్పటికే లోక్ సభ  స్పీకర్ ను కలిసి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు.

 

తాజాగా ఈరోజు వైసీపీ ఎంపీలు అంతా కలిసి ఒక ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లి స్పీకర్ ను కలిసి రఘురామ కృష్ణం రాజు పై వేటు వేయాల్సిందిగా కోరుతున్నారు. ఈ వ్యవహారంపై తాజాగా స్పందించిన రఘురామకృష్ణంరాజు ఇప్పటి వరకు తన విషయంలో జరుగుతున్న పరిణామాలన్నీ, జగన్ కు తెలియకుండా జరుగుతున్నాయని భావించానని, కానీ ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం చూస్తుంటే, మొత్తం జగన్ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుందని అర్థమవుతుందని ఆయన అన్నారు. తనపై అనర్హత వేటు వేయించేందుకు ఎంపీలంతా ఢిల్లీకి వెళ్లడం, ప్రజాధనం వృధా చేయడమేనని, తాను పార్టీకి, పార్టీ అధినేతకు వ్యతిరేకంగా మాట్లాడలేదని ఆయన చెప్పుకొచ్చారు.

 

కానీ ప్రజా సమస్యల విషయంలో తనపై వేటు వేస్తే, పార్లమెంట్ లో ఎవరూ ఉండరు అని చెప్పుకొచ్చారు. తాను వెంకన్న భూములు అమ్మ వద్దని చెప్పినందుకే తనపై వేటు వేసే ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ తాను, అగ్నిపునీతుడినై బయటికి వస్తాను అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. తనపై అనర్హత పిటిషన్ వేయాలని విషయంలో వైసిపి ఎంపీలు మరోసారి ఆలోచించుకోవాలని ఆమె కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: