2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ జనసేన ఎంత ప్రభావం చూపిందో రాష్ట్ర ప్రజలంతా చూశారు. కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి పొత్తులో పోటీ చేసిన జనసేన కేవలం ఒకే ఒక సీటుని గెలుచుకుంది. రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ విజయం సాధించి, ఇప్పుడు వైఎస్సార్‌సీపీ వైపు వెళ్లారు. ఇక రెండుచోట్ల పోటీ చేసిన పవన్ కల్యాణ్ పరిస్థితి ఏమైందో కూడా తెలిసిందే. అయితే జనసేన గెలవడానికి ఒక సీటే గెలిచింది గానీ, కొన్ని సీట్లలో ఓట్లు చీల్చి టీడీపీని గెలుపుకు దూరం చేసింది. దాదాపు 50 సీట్లలో టీడీపీ గెలుపుపై జనసేన ప్రభావం చూపింది.

 

ఒకవేళ టీడీపీ-జనసేనలు కలిసి పోటీ చేసి ఉంటే దాదాపు 50 సీట్లు అయిన గెలుచుకునేవారని తెలుగు తమ్ముళ్ళు ఇప్పటికీ చర్చించుకుంటూ బాధపడుతున్నారు. ఇదే క్రమంలో కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో జనసేన పోటీ చేసి ఉంటే బాగుండేది అని తమ్ముళ్ళు భావించారు. ఎన్నికల సమయంలో ఇక్కడ జనసేన అభ్యర్ధి అనుహ్యాంగా పోటీ నుంచి తప్పుకోవడం కొడాలి నానికి ప్లస్ అయిందని తమ్ముళ్ళు చెప్పుకుంటారు.

 

అయితే ఎన్నికలైపోయాక గుడివాడలో జనసేన కార్యకర్తలు కొడాలి నానికే ఎక్కువ మద్ధతుగా ఉంటున్నారు. కొడాలి నాని ఉండగా గుడివాడలో వేరే పార్టీ గెలవడం చాలా కష్టమని భావించి జనసైనికులు కొడాలికి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఇక్కడ జనసేన కార్యకర్తలు రాష్ట్ర స్థాయిలో పవన్‌ని అభిమానించిన స్థానికంగా కొడాలిని ఇష్టపడుతున్నారు. అయితే జనసేన కార్యకర్తలు ఎక్కువగా కాపు సామాజికవర్గానికి చెందినవారే. ఇక వీరికి టీడీపీ అంటే పెద్ద పడదు. దీంతో వాళ్ళు కొడాలి వైపుకు వచ్చేస్తున్నారు.

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం చాలాచోట్ల జనసేన కార్యకర్తలు కొడాలికి మద్ధతు తెలపడానికి రెడీగా ఉన్నారు. రాష్ట్రమంతా జనసైనికులు వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా ఉంటే గుడివాడలో మాత్రం మంత్రి కొడాలికి మద్ధతు పలుకుతున్నారు. మొత్తానికి గుడివాడలో జనసైనికుల రూటే సెపరేట్ అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: