ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం కరోనా వైరస్ అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ మహమ్మారి వైరస్ కు సంబంధించి రోజుకో  కొత్త వాదన తెరమీదకు వస్తూనే ఉంది. ఇక ఇటీవలే బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకున్న చికెన్ వింగ్స్ లో కరోనా  వైరస్ ఆనవాళ్లను గుర్తించినట్లుగా ఇటీవల చైనా  ఓ ప్రకటన విడుదల చేయడం సంచలనంగా  మారిపోయింది. ఈ నేపథ్యంలో బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకునే చికెన్ తినాలి అంటేనే ఎంతో మంది ప్రజలు భయపడిపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆహారం లేదా ప్యాకేజింగ్ ద్వారా కరోనా  వైరస్ సోకుతుంది అని అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. ఆహారపు గొలుసు ద్వారా కరోనా  వైరస్ వ్యాప్తి చెందుతుందన్న  తప్పుడు వార్తలను నమ్మి భయాందోళనకు గురి కావద్దని సూచించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.



 ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ ప్రోగ్రాం హెడ్  మైక్ ర్యాన్  వెల్లడించారు. ఆహార ప్యాకేజీలపై కూడా కరోనా  వైరస్ ఉంది అంటూ వస్తున్న వాదనలు దృశ్య తాము లక్షలాది ప్యాకేజీలను పరీక్షించి చూడగా  కేవలం పదుల సంఖ్యలో ప్యాకేజీలలో  మాత్రమే వైరస్ ఆనవాళ్లను గుర్తించినట్లుగా... వరల్డ్  హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది.కాగా  కొన్ని దేశాల నుంచి చైనా కు భారీ ఎత్తున మాంసం ఉత్పత్తులు దిగుమతి అవుతున్నాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో బ్రెజిల్ నుంచి చైనాకు దిగుమతి అవుతున్న చికెన్ వింగ్స్ లో కరోనా  వైరస్ ఆనవాళ్లను గుర్తించినట్లు ఇటీవల చైనా ప్రకటించింది.




 అయితే దీనిపై అటు ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు బ్రెజిల్ ప్రభుత్వం కూడా స్పందించింది. ప్రజల నుంచి దిగుమతి చేసుకుంటున్న చికెన్ వింగ్స్  లో కరోనా  వైరస్ ఆనవాళ్లను గుర్తించాము అంటూ చెబుతున్న చైనా.. దీనిపై వివరణ ఇవ్వాలి అంటూ కోరింది బ్రెజిల్. తమ దేశం నుంచి ఎగుమతి అవుతున్న అన్ని వస్తువుల విషయంలో కఠినతరమైన నిబంధనలు పాటిస్తున్నాము  అంటూ తెలిపిన బ్రెజిల్ వ్యవసాయ శాఖ... తమ దేశం దాటి వెళ్ళిన తర్వాత  ఏమవుతుంది అనేది మాత్రం తమ బాధ్యత కాదు అంటూ స్పష్టం చేసింది.  మరి దీనిపై చైనా ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: