ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ 42 ఏళ్ల బ్యాంకు మేనేజర్ తనకి కరోనా వైరస్ సోకిందన్న బాధతో ఆస్పత్రి పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మొరాదాబాద్ లో కొవిడ్-19 ఆసుపత్రి ఆరవ అంతస్తు నుండి ఈ బ్యాంకు ఉద్యోగి దూకి ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపుతుంది. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలోని తీర్థంకర్ మహావీర్ మెడికల్ కాలేజీ, పరిశోధనా కేంద్రంలో గురువారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.



చనిపోయిన వ్యక్తి పేరు రాజేష్ అని, అతను గ్రామీణ బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తున్నాడని పోలీసు విచారణలో తెలిసింది. గత నెలలో అతనిలో కరోనా వైరస్ అవశేషాలు కనిపించడంతో... జూలై 21వ తేదీన ఓ ఆస్పత్రిలో కొవిడ్-19 టెస్ట్ చేయించుకున్నారు. అయితే అతని కొవిడ్-19 నిర్ధారణ పరీక్షల లో పాజిటివ్ గా తేలింది. దీంతో అతను జులై 25 వ తేదీన ఆసుపత్రిలో చేరారు. అంతలోనే ఏమైందో ఏమో కానీ అతను బలవన్మరణానికి పాల్పడ్డారు.


బ్యాంకు మేనేజర్ మృతి పై స్పందించిన మొరాదాబాద్ పోలీస్ సూపరింటెండెంట్ అమిత్ ఆనంద్ రాజేష్ మరణించడం విషాదకరమని... కరోనా వచ్చినంత మాత్రాన చనిపోవలసిన అవసరం లేదని... ఆత్మవిశ్వాసం ఉంటే ఎవరైనా కరోనాపై జయించగలరని అన్నారు. ఆగస్టు 26వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాకు కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అయిన సిరిగిరెడ్డి గంగి రెడ్డి కూడా కరోనా సోకిందన్న బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. సిరిగిరెడ్డి గంగి రెడ్డి వేగంగా వెళ్తున్న ట్రైన్ ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆగస్టు 23వ తేదీన కరోనా ఆస్పత్రి నుండి పారిపోయిన సిరిగిరెడ్డి గంగి రెడ్డి మంగళవారం యెర్రాగుంట్లాలోని సున్నపురాల్లా పల్లె వద్ద రైల్వే ట్రాక్‌ల సమీపంలో విగతజీవిగా కనిపించారు. ఇకపోతే భారత దేశ వ్యాప్తంగా వందల సంఖ్యలో కరోనా వైరస్ సోకిందని చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: