టిక్ టాక్ ద్వారా ఫేమస్ సెలబ్రిటీ హోదాను సంపాదించిన ఎంతోమంది టిక్ టాక్ నిషేధానికి గురి కావడంతో నిరాశలో మునిగిపోయారు. ఆ తర్వాత రోజుల్లో టిక్ టాక్ యూజర్లు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్న విషయం తెలిసిందే. అందరిలో మళ్లీ టిక్ టాక్ వస్తే బాగుండు అనే ఆశ మాత్రం చావలేదు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే త్వరలో టిక్ టాక్ భారత్ లోకి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే టాక్ వినిపిస్తోంది. చైనా కంపెనీ కావడంవల్ల టిక్ టాక్ ను భారత్ బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.
కాగా ప్రస్తుతం టిక్ టాక్ యాప్ ను జపాన్ కు చెందిన సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ కొనుగోలు చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతి పెద్ద మార్కెట్ కలిగిన భారతీయ భాగస్వామి కోసం తీవ్రంగా వెతుకులాట ప్రారంభించిందట సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్. ఇప్పటికే రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్ లాంటి కంపెనీలతో కూడా టిక్ టాక్ కొనుగోలులో భాగస్వామి కోసం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ చర్చలు కనుక విజయవంతమైతే త్వరలో టిక్ టాక్ అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టిక్ టాక్ ప్రియులందరికీ ఇది శుభవార్తే అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి