కరోనా  వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను చిగురుటాకులా వణికిస్తు  శర వేగంగా వ్యాప్తి చెందుతూ అతలాకుతలం చేస్తుంది. ఎన్ని  నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ కరోనా వైరస్ మాత్రం రోజురోజుకూ విజృంభిస్తుంది  తప్ప ఎక్కడా తగ్గిన  దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. పలు దేశాలలో అయితే రోజురోజుకూ పరిస్థితి చేయి దాటి పోతుంది. ఎంతో మందిని బలితీసుకుంది ఈ మహమ్మారి వైరస్. చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా  వైరస్.. మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తుంది అన్న నిజాన్ని చైనా దాచిపెట్టడం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పాకిపోయింది అన్న విషయం తెలిసిందే.




 ప్రపంచవ్యాప్తంగా పాకి  పోయిన తర్వాత మనిషి నుంచి మనిషికి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది అన్న నిజాన్ని బయట పెట్టింది చైనా.  దీంతో ప్రపంచ దేశాలు మొత్తం చైనా పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. చైనా ఉద్దేశపూర్వకంగానే కరోనా  వైరస్ కి సంబంధించిన నిజాలు దాచి ప్రపంచదేశాల వినాశనం కోరుకుంది అంటూ ఎన్నో విమర్శలు చేశారు. అయితే ప్రపంచ దేశాలు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ చైనా మాత్రం.. ఎక్కడ నోరు మెదపలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థను  సైతం.. అబద్ధాలతో నమ్మించింది. కాగా  కరోనా  పుట్టడానికి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందడానికి చైనా కారణమని ప్రపంచ దేశాలకు తెలిసిందే.




 కానీ ఇటీవల చైనా ఇచ్చిన  స్టేట్మెంట్ మాత్రం తెగ కామెడీగా ఉంది అని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కామెడీ ట్రాక్ బాగానే నడిపిస్తున్నారు అంటూ సెటైర్లు వేస్తున్నారు. కరోనా వైరస్ పుట్టుక గురించి ఆలస్యంగా ప్రపంచానికి తెలియజేసిందన్న ఆరోపణలతో  విమర్శల పాలవుతున్న చైనా .. కోట్లాది మంది ప్రాణాలను  కాపాడింది అంటూ జిన్ పింగ్  స్టేట్మెంట్ వచ్చారు. కరోనా  కట్టడికి తాము తీసుకున్న చర్యల కారణంగానే ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రాణాలు  కాపాడబడ్డాయని.. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న వైరస్ ను కంట్రోల్ చేసింది తామేనంటూ ఇటీవల జిన్ పింగ్  స్టేట్మెంట్ ఇవ్వడం తెగ కామెడీగా ఉంది అని విశ్లేషకులు సెటైర్లు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: