వివరాల్లోకి వెళితే... కెంటకీ లో లూయిస్ విల్లెకి చెందిన మార్టిన్ అనే వ్యక్తి తన ప్రియురాలిని కిరాతకంగా చంపేశాడు. ఇక ఆమె శవాన్ని ముక్కలు చేసి 3 బాక్సుల్లో సర్దుకున్నాడు. ఆ తర్వాత ఆ బ్యాగ్ తీసుకుని 400 మైళ్లు ప్రయాణించి తల్లి దండ్రుల వద్దకు చేరుకున్నాడు. ఆ బ్యాగులను తెరవ కుండా ఇంట్లోనే భద్రపరిచాడు. కొద్ధి రోజుల తర్వాత బ్యాగుల నుంచి దుర్వాసన వస్తుండటాన్ని గమనించిన తల్లిదండ్రులు ఏంటని తెరిచి చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. బ్యాగ్ లో పూర్తిగా మహిళ శరీర భాగాలు కనిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... మహిళను దారుణంగా చంపి బ్యాగ్ లో శరీర భాగాలను సర్దుకొని వచ్చినట్లుగా గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో పోలీసులకి షాకింగ్ సమాధానం ఇచ్చాడు సదరు వ్యక్తి. ప్రియురాలితో ఎప్పుడు కలిసి ఉండాలనే అతిప్రేమ వల్ల ఇలా చంపి మృతదేహాన్ని ముక్కలు చేసి బ్యాగులో తనతో ఉంచుకున్నాను అంటూ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సైతం షాకయ్యారు. ఇక ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. సదరు నిందితుని కోర్టు ముందు హాజరు పరిచారు పోలీసులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి