గతంలో చాలా సందర్భాల్లో రాజకీయ నాయకులు పర్యటనకు వెళ్లే సమయాలలో హెలికాప్టర్ ప్రమాదాలు జరిగాయి. దీనికి చాలా ఉదాహరణలే ఉన్నాయి దివంగత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి అలాగే హెలికాప్టర్ ప్రమదంలో చనిపోయారు. మరియు స్పీకర్ జీఎంసీ బాలయోగి అలానే విమానప్రమాదంలో మరణించారు. అయితే వీటన్నింటికీ వివిధ కారణాలు ఉన్నప్పటికీ ప్రమాదాలు సంభవించడం చాలా బాధాకరం. ఇప్పుడు తాజాగా మన కేంద్ర మంత్రి ఒకరు తృటిలో అతిపెద్ద ప్రమాదం నుండి బయటపడ్డారు. మరి ఆ విసస్యలేంటో ఒకసారి మన ఏపీహెరాల్డ్ ఎర్రటికి ద్వారా తెలుసుకుందాము.

కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కొద్దిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అదృష్టం అయన పక్షం లేకుంటే ఇపుడు మరోలా ఉండేది. ప్రస్తుతం బీహార్ లో ఎన్నికల హడావిడి జరుగుతోంది. ఈ సందర్భంగా ఈయన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్లారు. ఆ రాష్ట్రంలోని వివిధ సభల్లో బీహార్ మంత్రులు మంగళ్ పాండే సంజయ్ ఝాలతో కలిసి హెలిక్యాప్టర్ లో పర్యటిస్తూ మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి రవిశంకర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ బీహార్ రాజధాని పాట్నా విమానాశ్రయంలో ప్రమాదానికి గురైంది. ఈ  ప్రమాదం కరెంట్ తీగల కారణంగా జరిగినట్లు అధికారులు తెలిపారు. హెలికాప్టర్ ఈ కరెంట్ తీగలకు తగలడం వలన దాని రెక్కలు విరిగిపోయాయి, దీనితో అందరూ చాలా ఆందోళనకు గురయ్యారు.

అయితే ఆ భగవంతుని దయ వలన ఈ ప్రమాదం నుంచి కేంద్ర మంత్రి రవిశంకర్ క్షేమంగా బయటపడ్డారు. ఇదే హెలికాప్టర్ లో ఆయనతో పాటుగా మంత్రులు మంగళ్ పాండే, సంజయ్ ఝాలు కూడా ఉన్నారు. బీహార్ లో న్నికల ప్రచారం ముగించుకొని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే పైలట్ ఎంతో చాకచక్యంగా ఈ ప్రమాదాన్ని గుర్తించి కిందకు దించడంతో ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లకుండా పెద్ద ప్రమాదం తప్పింది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: