ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోఇప్పుడు కొన్ని కొన్ని పరిణామాలు ఆసక్తిగా ఉన్న సంగతి తెలిసింది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది కాస్త అందరిలో కూడా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ప్రధాన న్యాయమూర్తికి సీఎం జగన్ రాసిన లేఖ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం గా మారిన తర్వాత న్యాయవ్యవస్థ స్పందిస్తున్న తీరు కూడా ఇప్పుడు కాస్త ఆందోళన కలిగిస్తుంది. సీఎం జగన్ టార్గెట్ గా కొన్ని శక్తులు ఇప్పుడు కాస్త ఎక్కువగా కష్టపడుతున్నాయి. దీనిపై అందరూ ఆసక్తిగా చూస్తున్నాయి.

అయితే ఇప్పుడున్న కొన్ని పరిణామాల ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్ లో కొన్ని రాజకీయ శక్తులు సీఎం జగన్ కు వ్యతిరేకంగా కొన్ని ఉద్యమాలు చేసే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. మాజీ న్యాయమూర్తులు మాజీ లాయర్లు ఇలా కొంతమందిని కలుపుకొని తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. న్యాయవ్యవస్థను సీఎం జగన్ ఇబ్బంది పెడుతున్నారు అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లడానికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కాస్త ఎక్కువగానే కష్టపడుతుంది.

ఈ మేరకు మాజీ న్యాయమూర్తులు సహాయ సహకారాలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది ఆయనకు పరోక్షంగా అండగా నిలబడిన సంగతి తెలిసిందే. మరి భవిష్యత్తులో ఏవిధమైన పరిణామాలు ఉంటాయి అనేది ఇప్పుడు అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే సీఎం జగన్ కి ఎదురు లేదు. చంద్రబాబు నాయుడుకి అంత సాధ్యం కాకపోయినా న్యాయ వ్యవస్థ ద్వారా ఇబ్బంది పెట్టే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కానీ సీఎం జగన్ విషయంలో ఇప్పుడు న్యాయవ్యవస్థ చంద్రబాబునాయుడు ఆశించిన విధంగా వ్యవహరించకపోవచ్చు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. గతంలో కూడా చాలా మంది సీఎంలు ప్రధాన న్యాయమూర్తులకు ఎన్నో లేఖలు రాశారు. మరి భవిష్యత్తులో ఏవిధమైన పరిణామాలు ఉంటాయి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: