భారత్ చైనా సరిహద్దు లో వివాదాల ను శాంతింప చేసేందుకు .. ఇటీవల భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ చైనా విదేశాంగ శాఖ మంత్రితో.. దౌత్యపరమైన చర్చలు జరిపారు. అయితే చైనా మాత్రం సరిహద్దు ప్రాంతాల్లో శాంతియుత వాతావరణాన్ని కోరుకోవటం లేదని ఈ చర్చల ద్వారా తన వైఖరిని మరోసారి తెలియజేసింది. ఒక వైపు చైనా సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని చెప్తూనే. మరోవైపు సరిహద్దు ప్రాంతాల్లో తమ ఉద్రిక్తతలను పెంచుతుంది. దీంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఇరుదేశాల మధ్య జరిగిన విదేశాంగ మంత్రుల సమావేశం అనంతరం మన దేశ విదేశాంగ మంత్రి జయశంకర్ వెల్లడించారు.


అయితే చైనా వైఖరికి బుద్ధి చెప్పాలంటే భారత యుద్ధ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. ఇందులో భాగంగానే అమెరికా నుంచి అత్యవసరంగా అధునాతన వార్ ఫేర్ కిట్స్ ను కొనుగోలు చేస్తోంది. భారత-చైనా దేశాల మధ్య చర్చలు దాదాపు నిలిచిపోవడంతో ఇక శీతాకాలంలో లడాఖ్ సరిహద్దుల్లో సైనిక మోహరింపును పెంచాలని కూడా ఇండియన్ ఆర్మీ భావిస్తోంది. యుధ్ధ నౌకలకు, విమానాలకు అవసరమైన విడిభాగాలు, ఇంధనం కొనుగోలుకు సంబంధించి భారత-అమెరికా దేశాలమధ్య ఇదివరకే ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కింద ఈ వార్ ఫేర్ కిట్స్ కొనుగోలుపై ఇండియా దృష్టి పెట్టింది. 2016 లో ఈ ఉభయ దేశాల మధ్య ‘లాజిస్టిక్ ఎక్స్ చేంజ్ మెమోరాండం అగ్రమెంట్’ కుదిరిన విషయాన్ని సైనికవర్గాలు గుర్తు చేశాయి.


 ఇప్పటికే లడాఖ్ బోర్డర్లో మన ఫైటర్ జెట్ విమానాలు రెడీగా ఉన్నాయి. అయితే ఇది చాలదని, మరిన్నిఅధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వార్ ఫేర్ సామగ్రి అవసరమని ఈ వర్గాలు భావిస్తున్నాయి. అయితే మరోసారి భారత్ చైనాతో చర్చలకు సిద్ధంగా లేదని, చైనాను ఓడించడానికి రక్షణ రంగానికి సంబంధించి ఆయుధ సంపత్తిని చేకూర్చడంలో మరిన్ని దేశాలతో.. కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నామని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: