ఇటీవల కురిసిన భారీ వర్షాని కి హైదరాబాద్ నగర పరిస్థితి దీన స్థితిలోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఎంతో  అభివృద్ధి చెందిన భాగ్యనగరంలో అక్రమకట్టడాల కారణంగా భారీ వర్షం కురవడం తో వరదనీరు ఎటూ పోలేక ఏకంగా జనావాసాల్లోకి నీరు చేరి   జనజీవనం స్తంభించి పోయింది. భాగ్య  నగర చరిత్రలోనే అత్యధిక వర్షపాతం నమోదు కావడం తో హైదరాబాద్ నగరం మొత్తం వరదల్లో మునిగి తేలుతుంది అనే విషయం తెలిసిందే . పెద్ద పెద్ద చెరువులను తలపిస్తున్న కాలనీల లో కాలి నడకన వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు. ఇలాంటి  నేపథ్యంలో అధికారులు ఏకంగా చిన్న చిన్న బోట్లలో కాలనీలలో   పర్యటిస్తూ పరిస్థితులను సమీక్షిస్తున్న విషయం తెలిసిందే .



 ఇటీవల కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్ నగరం ఇప్పటికీ కూడా వరదల నుంచి తేరుకోలేక పోతుంది అన్న విషయం తెలిసిందే. జిహెచ్ఎంసి  అధికారులు ముమ్మర సహాయక చర్యలు చేపడుతున్నారు... ఇప్పటికీ ఎన్నో కాలనీలు జలదిగ్బంధంలోనే వరద నీటితో అల్లాడిపోతున్నాయి. దీని కోసం కేసీఆర్ సర్కార్ కి తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తూ... ఎన్నో రకాలుగా సహాయక చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో కి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఇటీవలె ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాయం కోరారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.



 దీంతో వెంటనే సహాయం చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా సిద్ధమయ్యారు. గత కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం మొత్తం ప్రస్తుతం వరదల్లో  మునిగిపోయిన నేపథ్యంలో... కొన్ని ప్రాంతాల్లో పర్యటించడానికి బోట్ల అవసరం ఎంతగానో పెరిగింది.. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న బోట్ లను  తెలంగాణ రాష్ట్రానికి ఏపీ ప్రభుత్వం అందించేందుకు సిద్ధమైంది. 40 బోట్ లను  ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు చేరుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: