మృత్యువు ఎప్పుడు ఎటు నుంచి వచ్చి కబలిస్తుందో  అన్నది ఊహకందని విధంగా ఉంటుంది అనే విషయం తెలిసిందే. అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలోనే ఏదో ఒక విధంగా మృత్యువు వచ్చి కబళిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చైనాలో చిత్రవిచిత్రమైన ఆహారం తీసుకొని ఎంతోమంది ప్రాణాల మీదికి తెచ్చుకున్న ఘటనలు ఎప్పుడూ తెర మీదికి వస్తూనే ఉంటాయి. అది అన్ని దేశాలలో లాగా కాకుండా ఏది పడితే అది తినేస్తుంటారు చైనాలో . ప్రస్తుతం కరోనా  వైరస్ కి కూడా అలా ఏది పడితే అది తినడమే  కారణం కూడా చైనా చెబుతున్న విషయం తెలిసిందే. కేవలం కరోనా  వైరస్ మాత్రమే కాదు ఇష్టం వచ్చిన ఆహారాలను జంతువులను తింటూ ఏకంగా  ఎన్నో వైరస్ల వ్యాప్తికి  కారణం అవుతూ ఉంటుంది చైనా.



 దాదాపుగా ఇప్పటి వరకు ప్రపంచ దేశాలను భయపెట్టిన ఎన్నో వైరస్లు చైనా నుంచి వచ్చినవే అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇటీవల ఏకంగా చైనాలో ఒక  వంటకం కారణంగా 9 మంది మృతి చెందారు. సాధారణంగా నూడిల్స్ ఫుడ్ కి ఎక్కడైనా డిమాండ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే కాగా  చైనాలో అయితే నూడిల్స్ని తెగ తినేస్తున్నారు. నూడిల్స్ కి కేరాఫ్ అడ్రస్ అంటే చైనా అని చెబుతూ ఉంటారు. ఇక్కడ న్యూడిల్స్ తిని  ఏకంగా తొమ్మిది మంది మృతి చెందడం సంచలనంగా మారిపోయింది.



 అయితే ఏడాది క్రితం కి చెందిన నూడిల్స్ ని  నిల్వ ఉంచి ఇటీవలే వాటిని వండుకుని  తొమ్మిది మంది కి పెట్టడం కారణంగా తొమ్మిది మంది వాటిని తిని చివరికి ప్రాణాలు కోల్పోయారు. దాదాపు ఏడాది పాటు మొక్కజొన్న నూడిల్స్ ను  ఫ్రిడ్జ్ లో ఉంచారు. ఆ తర్వాత ఇటీవలే వాటిని ఉపయోగించుకోవాలని అనుకున్నారు. ఇక ఈ ఏడాది పాటు నూడిల్స్ ని  ఫ్రిడ్జ్ లో  ఉంచడంతో వాటిలో బొంగ్రికిక్  అనే విష పదార్థం తయారయింది. ఈ క్రమంలోని ఆ నూడిల్స్ ను  తిన్న తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని అయితే వీటి రుచి నచ్చక పోవడంతో చిన్నారులు తినకుండా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని వైద్యులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: