పండుగ సీజన్లో అన్ని బ్యాంకులు తమ కస్టమర్లను ఆకర్షించేందుకు ఎన్నో అద్భుతమైన ఆకర్షణీయమైన ఆఫర్లను అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే. వివిధ లోన్ లపై  వడ్డీ రేటు తగ్గించడం... లేదా ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా మాఫీ చేయడం లాంటి సౌకర్యాలు తమ కస్టమర్లకు ఈ పండుగ సీజన్ లో అందుబాటులో ఉంచాయి అన్ని బ్యాంకులు. కానీ ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంకింగ్ సంస్థ ఐసీఐసీఐ బ్యాంకు మాత్రం తమ కస్టమర్లకు పండగ సీజన్లో ఝలక్ ఇచ్చింది. ఇటీవల కీలక నిర్ణయం తీసుకునే కష్టమర్ లందరికీ భారీ షాక్ ఇచ్చింది. ఐసిఐసిఐ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఐసిఐసిఐ బ్యాంకు.



 దీంతో బ్యాంకు కస్టమర్ లపై ఈ వడ్డీరేట్ల తగ్గింపు నిర్ణయం ఎంతగానో ప్రభావం చూపే అవకాశం ఉందని బ్యాంకింగ్ రంగ నిపుణులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఐసిఐసిఐ బ్యాంక్ ఏడురోజుల దగ్గరనుంచి పదేళ్ల కాలపరిమితి లు ఫిక్స్డ్ డిపాజిట్లు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ముఖ్యంగా తక్కువ కాలపరిమితి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ల పై కీలక నిర్ణయం తీసుకున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు తగ్గించింది. ఇకపై ఏడు రోజుల నుంచి ఇరవై తొమ్మిది రోజుల కాలపరిమితి లోని ఫిక్స్డ్ డిపాజిట్లపై 2.5 శాతం మాత్రమే వడ్డీ లభిస్తుంది... ఇక 30 రోజుల నుంచి 90 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్లపై 3 శాతం వడ్డీ పొందేందుకు అవకాశం ఉంది.



 ఇలా అన్ని రకాల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఐ సి ఐ సి ఐ.  91 రోజుల నుంచి 184 రోజుల  ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.5 శాతం.. 185 రోజుల నుంచి ఏడాదిలోపు ఎఫ్‌డీలపై 4.4 శాతం వడ్డీ...  ఏడాది నుంచి రెండేళ్ల కాల పరిమితిలోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను బ్యాంక్ 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఏడాది నుంచి 18 నెలల ఎఫ్‌డీలపై 4.9 శాతం వడ్డీ సొంతం చేసుకోవచ్చు.
ఇక 18 నెలల నుంచి 2 ఏళ్ల కాల పరిమితిలోని ఎఫ్‌డీలపై 5 శాతం.. 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల కాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.15 శాతం, 3 ఏళ్ల నుంచి ఐదేళ్లలోని ఎఫ్‌డీలపై 5.35 శాతం, 5 ఏళ్ల నుంచి పదేళ్లలోపు ఎఫ్‌డీలపై 5.5 శాతం వడ్డీ వస్తుంది. కాగా కొత్త వడ్డీ రేట్లు అక్టోబర్ 21 నుంచే అమలులోకి వచ్చాయి. ఇకపోతే సీనియర్ సిటిజన్స్‌కు 50 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ రేటు లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: