బంగారం ధర మాత్రం ఇంకా పెరుగుతూనే ఉంది. నిన్న కాక మొన్న కాస్త తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ధర తగ్గడం అనే మాట మూడునాళ్ళ ముచ్చటగా మారింది. బంగారం ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. నిన్నటికి నేటికీ భారీగా బంగారం రేట్లు పెరిగాయి.. వెండి ధరలు నిన్నటి వరకు బంగారం ధర దారిలో పయనించిన సంగతి తెలిసిందే.. నేడు చూసుకుంటే వెండి ధరలు కాస్త ఊరట నిస్తున్నాయి.



హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలను చూసుకుంటే శుక్రవారం నాడు బంగారు రేటు పెరిగింది.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 పెరుగుదల తో రూ.51,490కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.150 పెరిగింది. దీంతో ధర రూ.47,200కు చేరింది. వెండి ధరలు కాస్త తగ్గాయి. కేజీ వెండి ధర రూ.500 దిగొచ్చింది. దీంతో వెండి ధర రూ.63,000కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల వెండి ధర పెరగడం తో డిమాండ్ పూర్తిగా తగ్గిపోయింది. దాంతో ఈరోజు వెండి రేటు పూర్తిగా క్షీణించింది.



ఇక అంతర్జాతీయ మార్కెట్ విషయానికొస్తే బంగారం ధర మళ్లీ పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.03 శాతం పెరుగుదలతో 1905 డాలర్లకు వచ్చింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.04 శాతం పెరుగుదలతో 24.70 డాలర్లకు చేరింది. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం రేట్లు భారీగా పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్ లు తదితర అంశాలు బంగారం ధర పై ప్రభావం చూపించడంతో ఇప్పుడు రేట్లు రోజుకో విధంగా మారుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: