కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాలపైన, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టినట్లు గా కనిపిస్తున్నారు.ఆయన తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, దుబ్బాక నియోజక వర్గంలో అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారానికి దిగుతారని పెద్ద ఎత్తున వార్తలతో వస్తున్న తరుణంలో, తెలంగాణకు సంబంధించిన అనేక అంశాలపై పవన్ వైకిరి అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల హైదరాబాద్ లో భారీ వర్షాల కారణంగా, నగరం మొత్తం వరదలు పెరిగిపోయి అతలాకుతలం అయింది. ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ లో వరదలు రావడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.


రోడ్లపై కాలువల్లా మారడానికి కారణం డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం,  ఆక్రమణలు పెరిగిపోవడం కారణం ఇవే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో జనసేన అధినేత పవన్  ఈ వ్యవహారంపై స్పందించారు. హైదరాబాదును ఈ విధంగా వరదలు ముంచెత్తడం కి కారణం ఏదైనా,  జీవో నెంబర్ 111 కు తూట్లు పొందడమే అని పవన్ అభిప్రాయపడ్డారు. అర్బన్ ప్లానింగ్ జీవో111 అమలు ఆవశ్యకత, నిబంధనలు అమలులో నేతలు జోక్యం ఎక్కువ అవడం వల్లే ఈ పరిస్థితి ఇంతవరకు  వచ్చిందని పవన్ అభిప్రాయపడ్డారు.



" భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణకు చాలా ప్రాధాన్యత పెరుగుతుంది. నదులు, చెరువులు, కొండలను ఆక్రమించి అమ్మేశారు. నదులు చెరువులు దేన్నీ వదిలిపెట్టకుండా  మనదేశంలో అర్బన్ ప్లానింగ్ వ్యవస్థకు తూట్లు పొడవడం ఆనవాయితీగా మారింది. కాలువలు .. చెరువులు దురాక్రమణ పై ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు మాట్లాడినంత బలంగా అధికారంలోకి రాగానే మాట్లాడలేకపోతున్నారు.. సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అధికారంలోకి వచ్చాక పరిస్థితులు వేరుగా ఉంటాయి ఏమో..? అధికారంలో లేము కాబట్టి తెలియదు. అందుకే మాట్లాడేటప్పుడు 360 డిగ్రీల కోణంలో ఆలోచించి మాట్లాడతాను. గతం నుంచి ఉన్న ప్రభుత్వాలు అర్బన్ ప్లానింగ్ కు తూట్లు పొడుస్తూ వచ్చాయి. గతంలో హైదరాబాద్ పరిధిలో 700 నుంచి ఎనిమిది వందల వరకు చెరువులు ఉండేవని చెబుతారు. ఇప్పుడు 180 మాత్రమే ఉన్నాయి.


అవి కూడా విస్తీర్ణం తగ్గిపోయే కాలుష్యంతో దుర్గంధం వెదజల్లుతూ ఉన్నాయి. గండిపేట చెరువు విస్తీర్ణం కూడా తగ్గిపోయింది కాలుష్యంపై నిర్లక్ష్యంగా ఉంటూ కాలుష్య నియంత్రణ చట్టాన్ని సరిగా అమలు చేయకపోవడం వల్లే ఈ దుస్థితి. ఇప్పటికైనా మేల్కొనాలి అంటూ ఎన్నో అంశాలను పవన్ ప్రస్తావించారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 111 అమలుపై దృష్టి పెట్టాలి. లేకపోతే మరి ఎన్నో ప్రమాదాలు ముంచెత్తే అవకాశం ఉందని పవన్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆక్రమణలకు రెగ్యులరైజేషన్ చేయడం పైన పవన్ తప్పుబట్టారు. ఈ వ్యవహారంలో ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శించలేదని కనీసం ఈ ప్రభుత్వం అయిన గత ప్రభుత్వాల నుంచి జరుగుతున్న తప్పులను సరి చేసే బాధ్యతను తీసుకోవాలంటూ పవన్ సుతిమెత్తగా హెచ్చరికలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: