ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా  వైరస్ కేసుల సంఖ్య ఏ రేంజిలో విజృంభిస్తుందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు మొన్నటివరకు రికార్డు స్థాయిలో నమోదైన కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి విద్యాసంస్థల ప్రారంభించు కునేందుకు అన్లాక్ మార్గదర్శకాల లో భాగంగా అనుమతులు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఏపీ సర్కార్ విద్యాసంస్థల ప్రారంభానికి తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు పాఠశాలలను ప్రారంభించాలని జగన్మోహన్ రెడ్డి సర్కారు నిర్ణయించినప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.



 ఇక ఈ సారి ఎట్టిపరిస్థితుల్లో పాఠశాలలను పునః ప్రారంభించాలని నిశ్చయించింది జగన్ సర్కార్. దీని కోసం కసరత్తులు కూడా చేస్తుంది. అయితే నవంబర్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను పునః ప్రారంభించాలని జగన్ సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే కేవలం ఒంటిపూట బడులు మాత్రమే నిర్వహించాలని జగన్ సర్కారు నిర్ణయించింది. ఉదయం వచ్చిన విద్యార్థులు అందరికీ మధ్యాహ్నం వరకు విద్యాబోధన చేసి ఆ తర్వాత మధ్యాహ్న భోజనం పెట్టి ఇంటికి పంపాలని నిర్ణయించింది. దీనికోసం అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటుంది.



 అయితే ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా పొరపాటు జరిగిన విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది జగన్ సర్కార్. పాఠశాలలకు చిన్న పిల్లలు కూడా వస్తారు కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా స్కూల్ విద్యార్థులందరికీ విద్యాబోధన చేసేందు కు వస్తున్న ఉపాధ్యాయులు అందరూ తప్పనిసరిగా కరోనా  నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. కరోనా పరీక్షలు చేసిన తర్వాత ఆ రిపోర్టులను ఉన్నతాధికారులకు పంపించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక రాష్ట్రంలో ఎక్కడైనా ఉపాధ్యాయులు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: