మ‌హారాష్ట్ర‌లో క‌రోనా మ‌ళ్లీ విజృంభిస్తోంది. లాక్‌డౌన్ సడ‌లింపుల‌తో జ‌నాల సంచారం పెర‌గ‌డంతో పాటు గాలిలో తేమ‌శాతం కూడా క‌రోనా వ్యాప్తికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌వుతున్నాయ‌ని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.  దేశంలో గత 24 గంటల్లో  53,370 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 78,14,682 చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 650 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,17,956కు చేరుకుందని ఆరోగ్య శాఖ తాజాగా విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.  ఇప్ప‌టి వ‌ర‌కు 89.78 శాతం కరోనా రోగుల రికవరీ రేటు ఉండగా, మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 8.71  శాతంగా ఉండ‌టం గ‌మ‌నార్హం.


దేశ ఆర్థిక రాజధాని నగరంగా పేరొందిన ముంబైలో కరోనా మహమ్మారి వల్ల 10వేల మందికి పైగా రోగులు మరణించారు. గడచిన 24 గంటల్లో ఒక్క ముంబై నగరంలోనే 1257 కరోనా కేసులు నమోదు కాగా, వీరిలో 50 మంది మరణించారు. దీంతో ముంబైలో కరోనా మృతుల సంఖ్య 10.016కు పెరిగింది. ముంబై నగరంలోనే 2,50,061 మందికి కరోనా సోకగా, రోగుల రికవరీ శాతం 88 శాతంగా ఉంది. ప్రస్థుతం ముంబైలో 19,500 కరోనా క్రియాశీల కేసులున్నాయి.50 ఏళ్లు పైబడిన వారిలో 85 శాతం మరణాలు నమోద‌య్యాయి. మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. సామాన్యుల ప్రజలతో పాటుగా రాజకీయ నాయకులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ కూడా కరోనా సోకింది.



 ఈ విషయాన్నీ ఆయనే  వెల్లడించారు. 'లాక్‌డౌన్‌ నుంచి నిరంతరం పనిలో ఉన్నాను. ఇపుడిక కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని ఆ దేవుడు కోరుకున్నట్టున్నా అంటూ  తెలిపారు.  ఇక తనతో గత కొద్దిరోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవాళ్లు అందరూ కరోనా పరీక్షలు చేసుకోవాల్సిందిగా కోరారు. ఇదిలా ఉండ‌గా నగరంలో 633 యాక్టివ్ కరోనా కంటైన్ మెంట్ జోన్లతోపాటు 8,585 భవనాలకు సీలు వేశారు.మహారాష్ట్రలో రోగుల రికవరీ రేటు 88.78 శాతంగా ఉందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్  పేర్కొన్నారు.మహారాష్ట్రలో ఇప్పటి వరకు మొత్తం 16,38,961 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇన్ఫెక్షన్ నుంచి  14,55,107 మంది రోగులు కోలుకున్నారు. రాష్ట్రంలో 43,152 మంది మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: