సాధారణంగా పండుగ సీజన్ వచ్చిందంటే చాలు ప్రజలందరిలో  ఆనందం నిండిపోతుంది అనే విషయం తెలిసిందే. ఎంతోమంది సమయాన్ని కుదుర్చుకుని మరి కుటుంబంతో గడుపుతూ పండుగను జరుపుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు కానీ ఈ పండుగ సీజన్ మాత్రం ఎంతో మందికి ఇబ్బందులను కలగజేస్తుంది అదే చెప్పాలి. ఎందుకంటే కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఎంతో మంది ఉపాధి కోల్పోయి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. కరోనా  వైరస్ కారణంగా అన్ని రంగాలు సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో ఎంతో మంది నిరుద్యోగులు కూడా మారారు.



 ఇంకెంతో మంది కనీసం ఉపాధి లేక కుటుంబ పోషణ భారమై తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి  తప్ప ఎక్కడా తగిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. రోజురోజుకు కరోనా  వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న తరుణంలో ప్రజల ఇబ్బందులు ఎక్కడా తగ్గడం లేదు. ఇప్పటికీ కూడా సరైన ఉపాధి దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రతి ఏడాది దసరా పండుగను ఉన్నంతలో ఎంతో వైభవంగా జరుపుకునే ప్రజలందరూ ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే విషయం తెలిసిందే.


 ఇదిలా ఉంటే అటు ప్రజలందరూ ఇప్పుడిప్పుడే కరోనా  వైరస్ నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో ముఖ్యంగా నిత్యావసరాల ధరలు సామాన్యులు అందరికీ చుక్కలు చూపిస్తున్నాయి అని చెప్పాలి. కరోనా  వైరస్ సంక్షోభం కారణంగా నిత్య అవసరాలైన ఉప్పు పప్పు నూనెల ధరలు భారీగా పెరిగిపోవడంతో ప్రస్తుతం సామాన్య ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు. కేవలం నిత్య అవసరాలు మాత్రమే కాకుండా సాధారణ కూరగాయల ధరలు కూడా కొండెక్కి కూర్చోవడంతో ప్రస్తుతం సామాన్య ప్రజలందరూ ఇబ్బందులు అన్నీఇన్నీ కావు అని చెప్పాలి. ఈ ఏడాది మార్చి నుండి ఆగస్టు వరకు  84 శాతంమంది కుటుంబాలు  ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో ఈ పండుగకు ఆర్థిక ఇబ్బందులతో పండుగ సంబరం కాస్త ఆవిరైపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: