తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇలా ఉండటానికి ప్రధాన కారణం ఆ పార్టీ నాయకత్వమే. ఆ పార్టీ నాయకత్వంలో ఉన్న లోపాలు ఆ పార్టీని చాలా వరకు కూడా ఇబ్బందులు పెడుతున్నాయి అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బలపడాల్సిన అవసరం ఉన్న సమయంలో కూడా చాలా మంది నేతలను చంద్రబాబు నాయుడు తో పాటుగా రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకులు కూడా పక్కన పెట్టే పరిస్థితి రావడంతో ఆ పార్టీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారి పోయింది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

చాలామంది నేతలు అసలు ఆ పార్టీ రాష్ట్ర అధిష్టానం మీద చాలా వరకు కూడా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణ విషయంలో చాలా వరకు కూడా విమర్శలు వస్తున్నాయి. ఆయన పార్టీని బలోపేతం చేయకుండా సొంత ప్రయోజనాల కోసం చూస్తున్నారని టిఆర్ఎస్ పార్టీ తో కలిసి ఆయన రాజకీయం చేస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పుడు వస్తున్న మరి కొన్ని వార్తలు కూడా తెలుగుదేశం పార్టీని చాలా ఇబ్బంది పెడుతున్నాయి.

ఇటీవల జాతీయ కమిటీ ని చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జాతీయ కమిటీ లో మళ్ళీ తెలంగాణ అధ్యక్షుడుగా ఎల్ రమణ ను నియమిస్తూ చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. దీంతో తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు పార్టీని వీడాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొంతమంది నేతలు చాలావరకు కూడా  అసహనంగా ఉన్నారు. అంతేకాకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా చాలామంది నేతలు సీరియస్ గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు చేసిన ఈ తప్పు ఇప్పుడు పార్టీని అన్ని విధాలుగా కూడా తెలంగాణలో పూర్తిగా నాశనం చేస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు భవిష్యత్తు ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: