ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ న్యూస్ చదవండి... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు, ప్రభుత్వానికి మధ్య సయోధ్య కుదిరే సూచనలు కనిపించడం లేదు. ఇప్పుడు ఏకంగా ముఖ్య మంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పై నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణ పై చర్చించేందుకు ఈ నెల 28న రావాల్సిందిగా రాజకీయ పార్టీలకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిలుపునిచ్చారు. ఇంతలో ఈ నెల 26 న పార్లమెంట్ ఉప ఎన్నికలు శాసన మండలి ఉప ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల అంశం పై చర్చించేందుకు ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ భేటీ నిర్వహిస్తున్నారని ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వర్తమానం వెళ్ళింది.

దానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆగ్రహించారు. నన్నే మీరు భేటీ కి రమ్మని పిలుస్తారా అంటూ మండి పడ్డారు. ఎన్నికల కమిషన్ ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ అని ఎన్నికల కమిషన్ ను ఒక సమావేశానికి రావాలని వర్తమానం పంపడం అభ్యంతరకరం అని ఇది బెదిరింపు ధోరణి లో ఉందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి ప్రవీణ్ ప్రకాష్ కార్యాలయానికి సమాధానం పంపారు. మీ తీరు ఎన్నికల కమిషన్ సంస్థల సమగ్రతను దెబ్బ తీసేలా ఉందని మీ వ్యవహారం హై కోర్టులోనే తేల్చుకుంటానంటూ నిమ్మగడ్డ వారికి రిప్లై పంపించారు.

https://youtu.be/dNBUtkubRL8

మరింత సమాచారం తెలుసుకోండి: