గత కొన్ని నెలలుగా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సంగతి కరోనా.. కంటికి కనిపించని ఈ వైరస్ తో ప్రజలు పోరాడి ప్రాణాలను రక్షించుకోవడానికి అహర్నిశలు కష్టపడి పోరాడుతున్నారు. అయితే ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా నమోదు అవుతున్నాయి. ప్రజల్లో కరోనా పై అవగాహన పెరగడం తో పాటుగా, ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. ఈ మేరకు ఇప్పుడిప్పుడే కరోనా ప్రభావం పూర్తిగా తగ్గుతుంది. ఆంధ్ర ప్రదేశ్ లో రికార్డ్ స్థాయిలో కేసులు తగ్గాయి. కరోనా మరణాల సంఖ్య కూడా పూర్తిగా తగ్గింది. ఇకపోతే ఈ వ్యాధి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పూర్తిగా తగ్గింది.



కరోనా కు టీకా ను కనిపెట్టడం లో  అన్నీ దేశాల వాళ్ళు కష్టపడుతున్నారు. అయితే ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ఆస్ట్రాజెన్‌కా అభివృద్ధి చేసిన టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పలు దేశాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా, ఈ వ్యాక్సిన్ కరోనా వైరస్ కారణంగా అధిక ముప్పు ఎదుర్కొంటున్న పెద్దవారిలోనూ సమర్ధవంతంగా పనిచేస్తున్నట్టు ఫైనాన్సియల్ టైమ్స్ తాజాగా వెల్లడించింది.ఆక్స్‌ఫర్డ్ టీకా బలమైన రోగనిరోధక ప్రతిస్పందనను ఉత్పత్తి చేయడంతో  వృద్దుల్లోనూ కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో సమర్థవంతంగా పాల్గొంటుందని వెల్లడించింది.



18 నుంచి 55 ఏళ్ల వయసు కలిగిన వాళ్ళల్లో  ఈ టీకా బాగా పని చేస్తుందని వెల్లడించారు.ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెన్‌కా‌ను రాయిటర్స్ సంప్రదించగా తక్షణమే స్పందించడానికి నిరాకరించాయి. ప్రయోగ దశలో ఉన్న ఈ టీకా వల్ల కరోనా ను పూర్తిగా తగ్గిస్తుందా లేక కొంతవరకు అదుపు చేస్తుందా అనే అంశాన్ని పరిశీలించనున్నారు.రోగ నిరోధకతను ఏవిధంగా ఉత్తేజపరుస్తుందోననే విషయాలు సవివరంగా, అత్యంత స్పష్టంగా తెలుసుకున్నారు.. ప్రస్తుతానికి 50-50 లో ఉన్న ఈ ఫలితాలు మరి కొన్ని రోజుల్లో పూర్తిగా పనిచేస్తుందని వైద్యులు , శాస్త్రవేత్తలు వెల్లడించారు. మొత్తానికి పాక్షికంగా కరోనా ను జయించినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: