ఆంధ్రప్రదేశ్ లో రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. రైతులకు ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా ఏపీ సర్కార్ చాలా వరకు జాగ్రత్తగా ముందుకు వెళ్తుంది. సిఎం జగన్ ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నారు. తాజాగా  ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా కేంద్రాలను వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కేంద్రాలుగా కూడా  నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేసేలా రైతు భరోసా కేంద్రాలకు ఆదేశాలు జారీ చేసింది ఏపీ సర్కార్.

రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల 641 రైతు భరోసా కేంద్రాలు వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలుగా వ్యవహరిస్తాయని తాజాగా విడుదల చేసిన ఆదేశాల్లో ఏపీ సర్కార్ పేర్కొంది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖతో పాటు మార్క్ ఫెడ్, ఆయిల్ ఫెడ్ , కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా తదితర సంస్థలు రైతు భరోసా కేంద్రాలతో పంట ఉత్పత్తుల కొనుగోలు వ్యవహారంలో సమన్వయం చేస్తాయని ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇ-క్రాప్ బుకింగ్ ద్వారా రైతులు పండిస్తున్న పంటలకు సంబంధిచింన వివరాలను సేకరించాల్సిందిగా గ్రామ వ్యవసాయ సహాయకులకు సూచనలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.

పంట ఉత్పత్తులను కొనుగోలు చేసే ఏజెన్సీలు రైతు భరోసా కేంద్రాలకు సమాచారం ఇవ్వాలని  సూచనలు చేసారు. రైతుల నుంచి కొనుగోలు చేసే వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులకు కనీస మద్ధతు ధర దక్కేలా చూడాలని  రాష్ట్ర ప్రభుత్వం తమ ఆదేశాల్లో సూచించింది. పంట ఉత్పత్తుల సేకరణకు సంబంధించి తలెత్తే వివాదాలను, ఇతర సమాచారాన్ని 155251 కాల్ సెంటర్ కు రైతులు తెలియచేయవచ్చని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. కాగా ఏపీలో రైతు భరోసా కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: