నేటి సమాజంలో చాల మందిని ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్యల్లో హైబీపీ ఒక్కటి. ప్రపంచవ్యాప్తంగా చాప కింద నీరులా ఎంతో మందిని కబలిస్తున్న వ్యాధి హైబీపీ. మద్యం అధికంగా సేవించడం, ఒత్తిడి, ఆందోళన గురవడం, గుండె జబ్బులు తదితర కారణాల వల్ల చాలా మందికి హైబీపీ వస్తుంటుంది. హైబీపీ ఉన్నట్టు లక్షణాలు కూడా బయటకు కనబడవు. అయితే నిశబ్దంగా ఇది గుండె, కిడ్నీలను డామేజ్‌ చేసేస్తుంది. అయితే సహజ సిద్ధమైన పదార్థాలను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా హైబీపీ సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దమా.

మనం దాల్చిన చెక్కను ఆహార పదార్థాల్లో వాడుతూ ఉంటాం. అయితే దాల్చిన చెక్కలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. దీన్ని నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే హైబీపీ తగ్గించుకోవచ్చు. తేనె, దాల్చినచెక్క పొడిని నిత్యం ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుంటే హైబీపీతోపాటు పీసీవోడీ, డయాబెటిస్ సమస్యల నుంచి బయట పడవచ్చు. అలాగే అధిక బరువు కూడా తగ్గించుకోవచ్చు.

డార్క్‌చాక్లెట్స్‌కు కూడా రక్తపోటును నియంత్రణలో ఉంచగలిగే శక్తి ఉంది. డార్క్‌ చాక్లెట్లు తినడం వల్ల రక్తనాళాలు ఎలస్టిక్‌ నేచర్‌ను సంతరించుకుంటాయి. దాదాపు 70 శాతం కోకాతో తయారైన డార్క్‌ చాక్లెట్‌తో చాలా ఉపయోగాలున్నాయి. అవిసె గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి హైబీపీని కంట్రోల్ చేస్తాయి. అలాగే ఈ గింజల వల్ల ఇతర అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవిసెగింజలను అలాగే తినవచ్చు. లేదా పొడి చేసుకుని మజ్జిగ, ఫ్రూట్ సలాడ్ వంటి వాటిలో కలుపుకుని కూడా తినవచ్చు.

ఇక యాలకులను నిత్యం ఆహారంలో భాగం చేసుకోడం ద్వారా హైబీపీకి చెక్ పెట్టవచ్చు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. అలాగే వీటిలో ఉండే ఫైబర్ మన శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. వెల్లుల్లి హైబీపీని తగ్గించడంలో అమోఘంగా పనిచేస్తుంది. నిత్యం ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను పచ్చిగా తినడం వల్ల హైబీపీ, కొలెస్ట్రాల్ తగ్గుతాయి. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: