ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ కారణంగా అన్ని దేశాలు లాక్ డౌన్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే లాక్ డౌన్ సడలింపులో భాగంగా ప్రజలంతా కోవిడ్-19 నియమ, నిబంధనలను పాటించాలని కోరారు. ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించడం, సామజిక దూరం పాటించాలని అధికారులు సూచించారు. అయితే మాస్కు ధరించమని చెప్పిన ఓ సెక్యూరిటీ గార్డు దారుణంగా కత్తితో పొడిచారు. ఈ ఘటన చికాగోలో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముఖానికి మాస్కులు, చేతికి శానిటైజరు వాడమని చెప్పినందుకు చికాగోలో ఓ దుకాణం సెక్యూరిటీ గార్డు (32)ను ఇద్దరు అక్కాచెల్లెళ్లు 27 సార్లు కత్తితో పొడిచారు. జెస్సికా హిల్‌ (21), జైలా హిల్‌ (18) అనే అక్కాచెల్లెళ్లు ఆదివారం పొద్దుపోయాక ఈ దాడికి పాల్పడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని మహిళా పోలీసు ప్రతినిధి కేరీ జేమ్స్‌ తెలిపారు.

అయితే  సెక్యూరిటీ గార్డుతో వీరిద్దరూ వాగ్వాదానికి దిగారని, ఒకరు అతనిపై పిడిగుద్దులు కురిపించారని ఆమె తెలిపారు. ఇంతలో జెస్సికా తన వెనుక జేబు నుంచి కత్తిని బయటికి తీసి పొడవటం మొదలుపెట్టగా.. మరో సోదరి గార్డును కదలనివ్వకుండా గట్టిగా పట్టుకుంది. సెక్యూరిటీ గార్డు ఛాతీపైన, చేతులు, వీపు భాగాన కత్తిపోట్లు పడ్డాయి. తక్షణం ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం జరిగిన కోర్టు విచారణలో నిందితుల సహాయార్థం ఉమెన్స్‌ కోర్టు నియమించిన అటార్నీ వాదిస్తూ.. స్వీయరక్షణకే ఈ దాడికి దిగారని, అక్కాచెల్లెళ్లు ఇద్దరూ బైపోలార్‌ డిజార్డర్‌ తో బాధ పడుతున్నట్టు తెలిపారు. దాడికి ముందు సెక్యూరిటీ గార్డు మహిళలపై ఎటువంటి దౌర్జన్యం చేయలేదని ప్రాసిక్యూటర్లు వాదనలు వినిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: