రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఎవరికీ అర్థం కాదు.. నిన్నటివరకు తమదే రాజ్యం అనుకున్నవారు నేడు వెలివేసినట్లుగా అయిపోతుంటారు.. రాజ్యం బయట ఉన్నవారు రాజ్యాధికారం చేస్తూ ఉంటారు.. ఎప్పటిఅప్పుడు తెలివిగా ఉంటూ ఎత్తులకు పై ఎత్తులు వేస్తే కానీ రాజకీయంలో ఎక్కువ కాలం అధికారంలో ఉండడం కుదరని పని.. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇప్పుడు ఇలాంటి సిచువేషన్ లోనే ఉన్నాడు.. వైఎస్ జగన్ దెబ్బకు కుదేలైపోయి అసలు రాజకీయాలలో ఉంటాడా లేడా అన్నట్లు అయన పరిస్థితి తయారైంది. ప్రజాశీర్వాదం మేరకు ఆయనను ముఖ్యమంత్రి చేశారు ప్రజలు..

పార్టీ ఓటమి పాలైన తర్వాత చంద్రబాబు చాలాకాలం వరకు అండర్ గ్రౌండ్ లో ఉన్నారని చెప్పాలి.. ఎందుకంటే గత రెండేళ్లుగా ఎప్పుడు కూడా అయన పార్టీ ని చక్కదిద్దుపెట్టుకోవాలనే ఆకాంక్ష ఎక్కడా కనిపించలేదు.. అమరావతి పోరాటం, జగన్ ని విమర్శించడమే ఆయనకు సరిపోయాయి..కనీ ఎక్కడ కూడా దిశా తప్పిన పార్టీ ని గాడిలో పెట్టుకోవాలని ఎక్కడా అనుకోలేదు. అలాంటిది ఇటీవలే పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ చార్జ్ లను నియమించి పార్టీ ని బాగుచేయడానికి మొదటి ప్రయత్నం అయితే ఇప్పుడు మొదలు పెట్టారు..  రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజక వర్గాలకు గానూ ఇన్ చార్జ్ లను నియమించి సంచలనం రేకెత్తించారు..

ఇక వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని జగన్ ను నీచంగా విమర్శిస్తున్నారు టీడీపీ నేతలు.. ఇక్కడ వారి రాజకీయం ఎంత నీచంగా తయారైందో చెప్పొచ్చు.. జగన్ చంద్రబాబు పేరుని కూడా బయటకు ఉచ్చరించరు కానీ చంద్రబాబు మాత్రం తెల్లారిలేస్తే జగన్ మీదనే విరుచుకుపడిపోతారు. దాన్ని చూసిన తమ్ముళ్ళు ఇన్ని వేల సార్లు రోజుకు ఆయన పేరు వల్లెవేసి బాబే తెగ ప్రచారం చేస్తున్నారని సెటైర్లు వేస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఫెయిల్యూర్ అని గట్టిగానే చంద్రబాబు గద్దిస్తున్నారు. అలా ఆయనే మరో వైపు జగన్ కి సింపతీ కూడా పెంచుతున్నారు. మొత్తానికి చంద్రబాబు బాగా ఫస్ట్రేషన్ లో ఉన్నారు. దానికి ఇప్పటికైతే మందు లేదంతే. 

మరింత సమాచారం తెలుసుకోండి: