దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే తమ కస్టమర్లకు ఎన్నో రకాల సర్వీసులను అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎక్కువ మంది కస్టమర్లను కలిగివున్న దిగ్గజ బ్యాంకు గా కొనసాగుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంతేకాదు కరోనా  వైరస్ సంక్షోభం సమయంలో కూడా ఎన్నో సరికొత్త ఆఫర్ లను కూడా ప్రకటిస్తూ కస్టమర్లకు అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న సర్వీసుల్లో  ఎటిఎం సేవలు కూడా ఒక భాగమే అన్న విషయం తెలిసిందే. డెబిట్ కార్డు ద్వారా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.




 అయితే మొన్నటి వరకు ఏటీఎం ద్వారా స్టేట్ బ్యాంకు కస్టమర్లు తీసుకునే నగదు మొత్తానికి లిమిట్ కూడా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే కస్టమరు ఉపయోగించే కార్డును  భట్టి  ఎంత నగదు మొత్తం తీసుకోవాలి అనేది కూడా ఆధారపడి ఉంటుంది. అయితే స్టేట్ బ్యాంక్ తమ కస్టమర్లకు ఇప్పటి వరకు 7 రకాల డెబిట్ కార్డులను జారీ చేస్తోంది. అయితే ఇటీవలే తమ కస్టమర్లు అందరికీ శుభ వార్త చెప్పింది. తమ కస్టమర్లు ఏటీఎం నుంచి విత్ డ్రా  చేసుకునే నగదు పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.





ఎస్‌బీఐ క్లాసిక్ అండ్ మ్యాస్ట్రో డెబిట్ కార్డు కలిగిన వారు రోజుకు రూ.20,000,  ఎస్‌బీఐ గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు ఉంటే రోజుకు రూ.40 వేలు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎస్‌బీఐ గోల్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు ఉన్న వారు రోజుకు రూ.50,000,  ఎస్‌బీఐ ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు ఉంటే రోజుకు రూ.లక్ష మొత్తాన్ని ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఎస్‌బీఐ ఇన్‌టచ్ ట్యాప్ అండ్ గో డెబిట్ కార్డు ఉన్న వారు రోజుకు రూ.40,000..  ఎస్‌బీఐ ముంబై మెట్రో కాంబో కార్డు ఉన్న వారు రూ.40,000 తీసుకోవచ్చు. ఇక ఎస్‌బీఐ మై కార్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు కలిగిన వారు రోజుకు రూ.40,000.. విత్ డ్రా  చేసుకోవచ్చు. అయితే రూ.10,000కు పైన ఏటీఎం నుంచి క్యాష్ విత్‌డ్రా చేయాలంటే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దీన్ని ఏటీఎంలో ఎంటర్ చేస్తేనే డబ్బులు వస్తాయి

మరింత సమాచారం తెలుసుకోండి: