కరోనా కారణంగా ఇళ్లకే పరిమితమైన విద్యార్థులు ఇక బడిబాట పట్టనున్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నవంబర్ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలు తెరుచుకోనున్నాయి. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అధికారులు ఇందుకు అనుగుణంగా సన్నాహాలు చేస్తున్నారు.  విద్యార్థులు కరోనా బారినపడకుండా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు  అధికారులు వెల్లడించారు.

మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులను నడపనున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని క్లాసులు  పునఃప్రారంభానికి సంబంధించి షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు. రోజూకి ఒక్కపూట మాత్రమే క్లాసులు నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. నవంబర్‌ 2 నుంచి 9,10, ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం,  నవంబర్‌ 2 నుంచి 9,10, ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం,  ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి. నవంబర్‌ 23 నుంచి 6,7,8 క్లాసులకు బోధన ప్రారంభం అవుతాయి. డిసెంబర్‌ 14 నుంచి 1,2,3,4,5 తరగతులను ప్రారంభిస్తారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలన్నింటికీ కూడా ఇదే షెడ్యూల్‌ వర్తిస్తుందిని అధికారులు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: