ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా  వైరస్ పట్టిపీడిస్తున్న విషయం తెలిసిందే.  అగ్ర  రాజ్యాలు సైతం ప్రస్తుతం కరోనా వైరస్ వణికిపోతున్నాయి. అధునాతన టెక్నాలజీతో కూడిన వైద్య సదుపాయం ఉన్నప్పటికీ ప్రస్తుతం అగ్రరాజ్యాలు కరోనా వైరస్ ను నియంత్రించలేక పోతున్నాయి. దీంతో ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా కరోనా వైరస్ తో అతలాకుతలం అయిపోతున్నాయి. మరికొన్ని దేశాలు ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిని కోలుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ ఎక్కడా కరోనా వైరస్ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు అన్న విషయం తెలిసిందే.



 అయితే కరోనా వైరస్ పై అవగాహన పెరిగిపోయి ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సాధారణ కార్యకలాపాలు కొనసాగిస్తున్న తరుణంలో ఏదో ఒక విధంగా మహమ్మారి కరోనా  వైరస్ పంజా విసురుతుంది. ప్రస్తుతం అగ్రరాజ్యాలకు సైతం సాధ్యం కాని రీతిలో కొన్ని చిన్న చిన్న దేశాలు కరోనా వైరస్ నియంత్రణలో విజయం సాధిస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. తైవాన్ తీసుకున్న చర్యలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా మారుతున్నాయి. సరిహద్దులు మూసివేయడం ఖచ్చితమైన కాంటాక్ట్ ట్రేసింగ్ సాంకేతికత సాయంతో క్వారంటైన్  పర్యవేక్షించడం... కరోనా నియంత్రణలో ప్రతి ఒక్కరు మాస్కు ధరించేలా చర్యలు తీసుకోవడంలో విజయం సాధించింది తైవాన్.



 తైవాన్  లో మొదటి కేసు నమోదు అవ్వగానే జాగ్రత్త పడిన ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. అంతేకాదు కరోనా సమయంలో కూడా ఆర్థికంగా ఎంతో ముందుకు దూసుకుపోతుంది. మొదటి కరోనా కేసు నమోదైన నాడే దేశ సరిహద్దులు మూసివేసి దేశంలోకి వచ్చే ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించింది. ముందస్తుగా వైరస్ ఉన్న వ్యక్తులను క్వారంటైన్ లో  ఉంచి కరోనా నియంత్రణలో విజయం సాధించింది. కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైన వెంటనే మాస్కులు ఎగుమతిపై కూడా ఆంక్షలు విధించింది. స్థానికంగా మాస్కులు ఉత్పత్తిని భారీగా పెంచింది. ఏ మాత్రం నిబంధనలు ఉల్లంఘించిన భారీ జరిమానా విధించింది. ఇలా ఎంతో కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు చేపట్టడం వల్ల కరోనా వైరస్ ను ఎంతో సమర్థవంతంగా నియంత్రించి ప్రస్తుతం ఆర్థికంగా కూడా ఈ దూసుకుపోతుంది తైవాన్. చిన్న దేశం అయినప్పటికీ ప్రస్తుతం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: