మాములుగా రాజకీయనాయకులు అంటేనే అవినీతికి పరాకాష్టగా ప్రముఖులు చెబుతుంటారు. ఇది కొంతమేరకు కరెక్ట్ అనే వాళ్ళు లేకపోలేదు. అయితే ప్రస్తుతమున్న రాజకీయ జనరేషన్ ప్రజలకుమంచి చేయాలన్నా ధోరణిని పక్కనపెడితే, మన పరిపాలనా కాలంలో ఎంతోకొంత పోగేసుకోవాలని ఆలోచించేవాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఇటీవల ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులన్నింటినీ త్వరగా విచారించి పూర్తిచేయాలని సుప్రీమ్ కోర్ట్ ఆదేశించింది కూడా..మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై కూడా చాలా కేసులున్నాయి. అవేమిటో తెలుసుకోవాలనుందా అయితే కింద ఇచ్చిన ఏపీహెరాల్డ్ ఆర్టికల్ ను చదవండి.

స్వర్గీయ నందమూరి తారక రామారావు భార్య లక్ష్మీపార్వతి 2005లో ఏసీబీ కోర్టులో చంద్రబాబు పై పెతితోన్ దాఖలు చేశారు. 1978 లో చంద్రబాబు ఎమ్మెల్యే గెలిచినప్పటినుండి ముఖ్యమంత్రి అయినంతవరకు ఆయన ఆదాయానికి మించి సంపాదించిన ఆస్తులకు సంబంధించి కేసు వేశారు.
గతంలో దివంగత నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని కోర్టులో పిటీషన్లు వేసిన సంగతి అందరికీ తెలిసిందే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 1999, ఆగస్టు 13న మరియు 1999 సెప్టెంబరులో చంద్రబాబు ఆస్తులపై సీబీఐ విచారణ కోరుతూ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, కొన్ని కారణాలచేత 2000 సంవత్సరం డిసెంబరు 12న ఈ పిటిషన్‌ను ఆయన ఉపసంహరించుకున్నారు.  

అప్పట్లో ప్రస్తుత బీజేపీ నేత కన్నా లక్ష్మి నారాయణ కాంగ్రెస్ లో ఉన్నారు. అదే సంవత్సరం 2004 చంద్రబాబునాయుడు మరియు ఆయన కుటుంబసభ్యుల ఆస్తులపై సీబీఐ విచారణ చేయాలని హై కోర్ట్ పెతితిఒన్ వేశారు. దీనితర్వాత కన్నా మరో అభియోగాన్ని కూడా ఈ కేసుకు జతచేసారు, హైదరాబాద్ లోని మాదాపూర్ వద్ద 500 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని ఎల్ అండ్ టీ కంపెనీకి అతి తక్కువ ధరకే ఇచ్చినట్లు పేర్కొన్నారు. మరి ఇన్ని కేసులు ఉండగా కోర్టులు ఎప్పుడు వీటన్నింటినీ పూర్తిచేస్తుందో తెలియడం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: