గత కాలం మేలు వచ్చు కాలం కంటే అని ఒక సామెత ఉంది. అంటే నిన్న బాగుంటుంది. నేడు అలాగే బాగా ఉండాలని లేదు. రేపటి సంగతి అంటే అసలు చెప్పలేం. మన పూర్వీకులు హాయిగా ఏ సాంకేతికత లేని రోజుల్లో జీవించారు. ఆరోగ్యంగా కూడా బతికారు. ఇంకా చెప్పాలంటే ఏ భయంకరమైన జబ్బులూ లేకుండా వందేళ్ళూ బతికారు. కానీ ఇపుడు చేతిలో స్మార్ట్ ఫోన్ వచ్చింది. ప్రపంచమే  కళ్ల ముందు ఉంది. ఇది సౌకర్యం. మరి దీన్ని అనుభవించిన వారు చేటు వచ్చినా తట్టుకోవాలి. ఇబ్బందులు వచ్చినా భరించాలి, సహించాలి.

మన శాస్త్రవేత్తలు కూడా అదే చెబుతున్నారు. కరోనా వైరస్ అన్నది అంతం కాదు ఆరంభం అంటున్నారు. గట్టిగా చెప్పాలంటే కరోనా జస్ట్ ఒక ఉదాహరణ మాత్రమే. పైగా రాబోయే  డేంజరస్ వైరస్ లతో పోలిస్తే అతి తక్కువ ప్రమాదకారి అని కూడా అంటున్నారు. ఒక్క కరోనాతోనే ప్రపంచం అల్లాడిపోతోంది. ఏడాదిగా ఎక్కడివారు అక్కడ అయ్యారు, ఇప్పటికి వ్యాక్సిన్ లేదు. సమీప భవిష్యత్తులో వస్తుందన్న వూసు లేదు. మందు అన్నది ఇప్పటికైతే దానికి లేనేలేదు.

సర్వం మూసుకుని ప్రజలు  కూర్చున్నారు. ఇలాంటి నేపధ్యంలో మరిన్ని కొత్త వైరస్ లు అలా వెల్లువలా వచ్చేసి మానవాళి మీద దాడి చేస్తాయని నింపాదిగా మన శాస్త్రవేత్తలు చెబితే కాళ్ల కింద భూమి కదలదా. ఆకాశం నెత్తిన పడదా. కానీ ఇదే నిజం అంటున్నారు. తట్టుకోవాల్సిందేనని కూడా చెబుతున్నారు. ఒకటి రెండు కాదు, లక్షల్లోనే వైరస్ లు ఉన్నాయట. అవి ఈ సృష్టిని, మానవాళిని సవాల్ చేస్తున్నాయట.ఇటీవల జెనీవాలో ఇంటర్ గవర్నమెంట్ సైన్స్ పాలసీ పల్ఆట్ఫాం ఆన్ బయోడైవర్సిటీ ఎకో సిస్టమ్ ఐపీబీఎస్ వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్కషాప్ పాల్గొన్న శాస్త్రవేత్తలు భయంకరమైన విషయాలనే చెప్పారు.  లక్షల్లో వైరస్ లు పొంచి ఉన్నాయని కూడా చెప్పుకొచ్చారు.

దానికి కారణం పెరుగుతున్న సాంకేతికత. జీవ వైవిధ్యంలో  తేడాలు, ప్రకృతి వినాశనం, వాతావరణ అసమానతలు అంటూ కూడా చెప్పారు. మొత్తానికి ఏదైతేనేం, రానున్న రోజులు కడు దుర్భరం అని చెప్పుకొచ్చారు.  మనిషి వైరస్ లతో పోరాడుతూనే బితుకుబితుకుగా బతకాలని కూడా చెపుకొచ్చారు. మొత్తానికి ఈ భూగోళం మీద మనిషిని సవాల్ చేసే శక్తులు వచ్చేశాయన్నమాట. బహు పరాఖ్.


మరింత సమాచారం తెలుసుకోండి: