ఇక్కడ ఓ వ్యక్తి ఓ రామ చిలుక ను ఎంతో ఆప్యాయంగా పెంచుకున్నాడు. అయితే ఇటీవలే ప్రమాదవశాత్తు యజమాని ఇంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగి గా రామ చిలుక ఏకంగా యజమానిని కాపాడింది. చిట్టి పొట్టి మాటలతో యజమానిని అప్రమత్తం చేస్తూ నిద్రలేపి చివరికి అగ్ని ప్రమాదం నుంచి కాపాడింది రామచిలుక. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని బ్రిస్బెట్ లో చోటుచేసుకుంది. అంటోన్ గుయోన్ అనే వ్యక్తి అర్ధరాత్రి సమయంలో గాఢ నిద్ర లో ఉన్నాడు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి.
ఇక గాఢనిద్రలో ఉండడంతో సదరు ఇంటి యజమాని అది గమనించలేకపోయారు. కానీ అక్కడే ఉన్న రామచిలక మాత్రం తన యజమాని పేరు పదే పదే పలుకుతూ నిద్ర లేపే ప్రయత్నం చేసింది. ఇక ఆ రామచిలుక పదే పదే పిలుస్తూ ఉండడంతో నిద్రలేచిన యజమాని ఇంటి చుట్టూ వ్యాపించి ఉన్న మంటలను చూసి ఒక్క సారిగా షాక్ అయ్యాడు వెంటనే అప్రమత్తమై ఎంతో జాగ్రత్తలు పాటిస్తూ ఇంటి నుంచి బయటకు పరిగెత్తాడు ఇంటి యజమాని. ఆ తర్వాత వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని సిబ్బంది మంటలను ఆర్పారు. ఇక తన రామచిలుక తనను పిలిచి మరి నిద్రలేపి ప్రాణాలు కాపాడిందని చెప్పుకొచ్చాడు సదరు వ్యక్తి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి