కరోనా  వైరస్ విషయంలో చైనా వ్యవహరిస్తున్న తీరు ఇప్పటికీ కూడా ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. చైనాలోని వుహాన్ లో  వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్  విషయంలో మొదట చైనా ఎన్నో నిజాలు దాచింది. ఈ వైరస్ మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తుంది అని నిజాలు దాచడం తో ప్రపంచం మొత్తం ఈ వైరస్ ను  లైట్ తీసుకున్నది.  ఇక ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వ్యాపించే విధంగా చైనా నుంచి ప్రపంచవ్యాప్తంగా విమానాలు కూడా నడిపింది చైనా ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఎంతోమంది ద్వారా ప్రపంచ దేశాలకు ఈ వైరస్ పాకి  పోయింది.



 ప్రపంచ దేశాలలో క్రమక్రమంగా కేసులు పెరిగిపోతున్న తరుణంలో ఈ వైరస్ ఒక మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తుంది అన్న విషయాన్ని బయట పెట్టి అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో ప్రపంచ దేశాలు చైనా వ్యవహారంపై తీవ్ర స్థాయిలో అనుమానాలు వ్యక్తం చేసి విమర్శలు కూడా చేసాయి. అయినప్పటికీ ఇప్పుడు వరకు చైనా తాను తప్పు చేసాము అని మాత్రం ఒప్పుకోలేదు. ప్రస్తుతం చైనా కరోనా రహిత దేశంగా మారిపోయింది. కరోనా కేసులు వచ్చాయి అంటే కఠిన ఆంక్షలు విధిస్తోంది. చైనా లోని  ఓ  ప్రాంతంలో రెండు కరోనా కేసులు బయటపడడంతో చైనా వ్యవహరించిన తీరు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.



 మంగోలియా రష్యా సరిహద్దుల్లో ఉన్నటువంటి చైనా కు సంబంధించిన ఒక నగరం మంజోళి  లో కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో శనివారం నుంచి మంగోలి  విమానాశ్రయంలో అన్ని రకాల విమానాలను కూడా రద్దు చేసింది చైనా ప్రభుత్వం. అయితే రెండు కేసులు బయట పడడం ద్వారా విమానాలను నిలిపివేయడం మంచి నిర్ణయమే కానీ కరోనా వ్యాపించిన మొదట్లో ప్రపంచదేశాలకు వ్యాపించకుండా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోయింది అని ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు. దీన్ని బట్టి చూస్తే చైనా ఉద్దేశపూర్వకంగా ప్రపంచ వినాశనానికి కరోనా వైరస్ ఉద్దేశపూర్వకంగానే వ్యాపించేలా చేసింది అన్నది నిజమే అని అర్థం అవుతుంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: