ఈ ఎన్నికల్లో భారీ షాక్ తిన్న చంద్రబాబు కు తిరుపతి ఉప ఎన్నిక విషయంలో పనబాక లక్ష్మి కొంత టెన్షన్ పెట్టిందని చెప్పొచ్చు.. తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిత్వం ఖరారయినా కాలు బయటపెట్టేందుకు బెట్టు చేసిన పనబాక లక్ష్మి మెట్టు దిగినట్టు తెలుస్తోంది. అసలు జరిగిన విషయం ఏంటంటే తిరుపతి అభ్యర్థి గా పనబాక లక్ష్మి ని చంద్రబాబు ఎంపిక చేశారు.. ఇక్కడ గెలుపు ధీమా తో ప్రచారం చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.. కానీ అనూహ్యంగా చంద్రబాబు ఎంత చెప్పినా ఆమె కాలు బయటపెట్టకపోవడం టీడీపీ క్యాడర్ ను కలవరపెట్టింది.. అందుకు కారణం లేకపోలేదట..

మొదటినుంచి చంద్రబాబు పట్ల ఆమె అసంతృప్తిగా ఉన్నట్లు ఆమె చర్యల ద్వారా తెలిసింది.. పార్టీ టికెట్ ఇచ్చినన్న హడావుడి ఏమీలేదు ఆమెలో.. చంద్రబాబు కుకృతజ్ఞతలు కూడా ఎక్కడ చెప్పిన దాఖలాలు లేవు. వారం క్రితమే ఆమె ఖారరాయినప్పటికీ తిరుపతిలో కనిపించడం లేదు. దాంతో ఆమె తీరు పట్ల చర్చ మొదలయ్యింది.ఎన్నికల వ్యయం విషయంలో పనబాక పట్టుబట్టినట్టు టీడీపీ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ పేరుతో ఖర్చు చేసేందుకు తాను సిద్ధంగా లేనని ఆమె స్పష్టం చేయడంతో చివరకు పార్టీ తరుపున మొత్తం వ్యయం భరించేందుకు అంగీకారం కుదిరినట్టు చెబుతున్నారు.

ఆ విషయంలో స్పష్టత ఇచ్చే వరకూ తాను ప్రచారానికి పూనుకునేది లేదని పనబాక లక్ష్మి తేల్చిచెప్పడంతో చివరకు టీడీపీ నేతలు దానికి అంగీకరించి ఆమెను బరిలో దింపే పనిలో ఉన్నారు.  పలువురు టీడీపీ నేతల మంతనాలు, అధినేత హామీతో ఆమె ప్రచారానికి సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. వారం రోజుల పైగా టెన్షన్ పెట్టిన పనబాక లక్ష్మి పట్టు వీడడంతో టీడీపీకి ఉపశమనంగా మారింది. చంద్రబాబుని కలిసిన తర్వాత ప్రచారానికి వెళతానని ఆమె కండీషన్ పెట్టినట్టు సమాచారం. దానికి టీడీపీ నేతలు అంగీకరించడంతో అందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: