గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వెనుకబడి ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ప్రచారానికి వచ్చే అవకాశాలు ఉండవచ్చు అందరూ భావిస్తున్నారు. అయితే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత కూడా లేదు. ప్రచారం చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు కొంత మంది ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కొంతమంది ఢిల్లీ నుంచి వచ్చే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది ఎంపీలు కూడా హైదరాబాద్ వచ్చి ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి అని ప్రచారం జరుగుతుంది.

ఇప్పటికే భారతీయ జనతా పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం అగ్రనేతలను దింపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా కీలక నేతలను ఇప్పుడు హైదరాబాదులో దింపే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే బిజెపి జాతీయ అధ్యక్షుడు కూడా ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నారు.

ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ప్రస్తుత ఎంపీ రాహుల్ గాంధీ ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఆయన హైదరాబాద్ పర్యటనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయనతో పాటు మాజీ కేంద్ర మంత్రులు ఇద్దరు ప్రచారం చేసే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఒక నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇవి చాలా కీలకంగా మారిన సంగతి తెలిసిందే. మరి ఈ ఎన్నికలను ఎలా ముందుకు నడిపిస్తారు ఏంటి అనేది చూడాలి. బీజేపీ మాత్రం ప్రచారం చేసే విషయంలో దూసుకుపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: