గ్రేటర్ ఎన్నికల హడావుడి మొదలైంది. హైదరాబాద్ లో ఇప్పుడు కరోనా ఏమాత్రం కానరాకుండా నేతలు ప్రచారంలో బిజీ అయిపోయారు. ఈ సారి అన్ని పార్టీలు తమ సత్తా చాటాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే తమ ప్రభావం తగ్గింది అని భావిస్తున్న టిఆర్ఎస్ పార్టీ తమ అగ్రశ్రేణి నేతలందరినీ నియోజకవర్గాల్లో ప్రచారం చేయిస్తోంది. బిజెపి ఏకంగా జాతీయ స్థాయి నాయకులు కూడా రంగంలోకి దింపి ప్రచారంలో పాల్గొనేలా చేస్తుంది.

కాంగ్రెస్ జాతీయ స్థాయి కాకపోయినా రాష్ట్ర స్థాయి నేతలను డివిజన్ల వారీగా పాదయాత్రలు చేస్తూ ముందుకు వెళుతోంది. అయితే ఇదివరకటి కంటే ఈ సారి ఎక్కువగా స్థానంలో పోటీ చేస్తున్న మజ్లీస్ పార్టీ కూడా ముస్లింస్ ఎక్కువ ఉన్న ప్రాంతాలలో తమ సత్తా చాటాలని చూస్తుంది. ఈ రోజు అసదుద్దీన్ ఓవైసీ షేక్పేట డివిజన్ లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం 8:30 గంటల నుంచి ఎంఐఎం ప్రెసిడెంట్ బారిష్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఇంటింటికి వెళ్లి తమ అభ్యర్థికి ఓటు వేయాలని అక్కడి ఓట్లర్లను అభ్యర్థిస్తున్నారు.

టోలిచౌకి లోని బృందావన్ కాలనీ మెయిన్ రోడ్డు నుంచి ఈ పాదయాత్ర కొనసాగుతుంది. అయితే నిన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రోహింగ్యాలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కల కలం రేపిన సంగతి తెలిసిందే. అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ఆయన ఆ వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు. ఇక బెంగళూరు సౌత్ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తనను జిన్నా వారసుడిగా అభివర్ణించడం మీద ఓవైసీ తీవ్రంగా ఫైర్ అయ్యారు. అసలు తనకు జిన్నాకు ఉన్న సంబంధం ఏమిటో చెప్పాలని ఆయన బీజేపీ నేతలను ఆయన నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: