మల్కాజిగిరి నియోజకవర్గం లో ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరూ ప్రజల చెంత వాలిపోయారు. తమకు ఓటు వేయాలి అంటూ ఓటర్లను ఆకట్టుకునే విధంగా డివిజన్ల వారీగా అభ్యర్థులందరూ ముమ్మర ప్రచారం చేపడుతున్నారు. డిసెంబర్ ఒకటవ తేదీన జిహెచ్ఎంసి ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కొంచెం సమయం మాత్రమే ప్రచారానికి మిగిలి ఉంది కాబట్టి ఉన్న కొంత సమయములో కూడా ముమ్మర ప్రచారం చేపట్టి ఓటర్ మహాశయులకు తమవైపు తిప్పుకునేందుకు ప్రస్తుతం అన్ని పార్టీల అభ్యర్థులు భారీ  స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం మల్కాజిగిరి నియోజకవర్గం లో ఏ డివిజన్లో చూసిన.. ప్రచార హోరు కనిపిస్తోంది.



 ముఖ్యంగా బీజేపీ అభ్యర్థులు ముమ్మర ప్రచారం చేపడుతూ మార్పు కోసం బీజేపీకి ఓటు వేయాలని బీజేపీకి ఓటు వేస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తామని ఒక్కసారి అవకాశం ఇవ్వాలి అంటూ కోరుతూ ప్రస్తుతం ముమ్మర ప్రచారం చేపడుతున్నారు. భారీ ర్యాలీలు రోడ్ షోలు.. చేపడుతూ ఓటర్లను ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అంతే కాకుండా ఇంటింటికి తిరిగి ప్రచారం చేపడుతున్నారు. ఇటీవలే మల్కాజిగిరి నియోజకవర్గం లోని వెంకటాపురం 135 వ డివిజన్ లో బిజెపి అభ్యర్థి గండి శివ అభిషేక్ ప్రచారం నిర్వహించారు.



 వెంకటాపురం 135 వ డివిజన్ పరిధిలోని కనజిగూడ సుభాష్ నగర్ సహా పలు ప్రాంతాలలో బిజెపి అభ్యర్థి గండి శివ అభిషేక్ ప్రచారం నిర్వహించగా.. ఇక ఆయన ప్రచారానికి మద్దతుగా సుమారు 500 మంది బీజేపీ కార్యకర్తలు ఆయనకు మద్దతు ప్రకటిస్తూ ప్రచారం నిర్వహించారు. అంతే కాకుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలోనే ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించిన గండి శివ అభిషేక్.. బిజెపిని గెలిపించాలి అంటూ ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన బిజెపి అభ్యర్థిని  మేయర్గా గెలిపిస్తే ముంపు బాధితులకు ఆర్థిక సాయం అందిస్తామని.. ఇల్లు దెబ్బతిన్న వారికి ఐదు లక్షల నష్టపరిహారం అందిస్తామని బిజెపికి అందరూ ఓటు వేసి గెలిపించాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: