సాధారణం గా మొసలి  పేరు ఎత్తారు అంటే అందరూ భయపడిపోతుంటారు అనే విషయం తెలిసిందే. ఇక ఎక్కువ గా మొసళ్లు  జనా వాసాల్లో  కనిపించవు కొన్నిసార్లు ఏవైనా వరదలు వచ్చినప్పుడు జనా వాసాల్లోకి నదుల నుంచి కొట్టుకుని వస్తూ ఉంటాయి మొసళ్లు. ఇక జనా వాసాల్లోకి ఎప్పుడైనా మొసళ్లు వచ్చినప్పుడు వాటిని పట్టుకుని జన సంచారానికి దూరం గా అటవీశాఖ అధికారులు వదిలేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. జన సంచారం ఉన్న చోట ఎక్కడైనా మొసళ్లు ఉన్నాయి అంటే చాలు వాటిని పట్టుకొని అటవీశాఖ అధికారులు దూరంగా వదిలేస్తుంటారు.



 కానీ ప్రస్తుతం  ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లో మాత్రం దీనికి భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఏకంగా జనా వాసాలకు దూరంగా కాదు జన సంచారం ఉండే నదుల వద్ద  మొసళ్లు ప్రస్తుతం ప్రభుత్వం వదులుతూ ఉండటం సంచలనం మారి పోయింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఇప్పటికే ఎన్నో అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ అందరినీ షాక్ కి గురి చేస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇక ఇప్పుడు ఏకంగా గంగానదిలో మొసళ్లను  వదలడానికి కూడా నిర్ణయం తీసుకుని  అందరినీ ఆశ్చర్యానికి గురి చేసారు. అయితే దీని వెనుక పెద్ద కథే ఉంది.



 గంగా నదిలోకి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మొసళ్లను  వదులుతోంది. ఉత్తర ప్రదేశ్ అటవీ శాఖ అధికారులు ఏకంగా 30 గరియల్ మొసళ్లను  గంగానదిలో విడిచిపెట్టినట్లు ఇటీవలే అధికారికంగా తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి కూడా చెప్పుకొచ్చారు. 2009 ప్రాంతంలో గంగానదిలో గరియల్ మొసళ్లను 2000 వదిలి  పెట్టారు. అయితే సన్నటి పొడవాటి నోరు ఉండే గరియల్  మొసళ్లు అంతరించిపోతున్నట్లు  యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ సంస్థ గుర్తించింది. ఈ క్రమంలోనే వాటిని సంరక్షించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: