సాధారణంగా వందల ఏళ్ల మజ్లిస్ ను మతతత్వ పార్టీ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు కొందరు అని మండిపడ్డారు ఎంఐఎం పార్టీ అధినేత ఎం‌పి అసదుద్దీన్.ఉగ్రవాదం అనేది ఒక మతానికి చెందినది కాదు అనవసరంగా దాన్ని మతానికి జోడిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

.గ్రేటర్ ఎన్నికల సందర్బంగా ఎర్రగడ్డ లో నిర్వహించిన ప్రచార సభలో అసదుద్దీన్ గారు మాట్లాడుతూ తమ పార్టీ కేవలం హక్కుల కోసం మాత్రమే పోరాడుతుందన్నారు.మనసులను కలుపుతుంది కానీ విడగొట్టే ప్రయత్నం ఎప్పటికీ చెయ్యడాని ఆయన వ్యాఖ్యానించారు.

.ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీని దేశ వ్యతిరేక పార్టీగా.బి‌జే‌పి ముద్రవేస్తుందని ఆయన మండిపడ్డారు.స్థానిక ఎన్నికల సమస్యల గురించి మాట్లాడకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.రాజ్యాంగా బద్దంగా మాట్లాడితే తనను జిన్నా అంటున్నారని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: