హైదరాబాద్ నగరాన్ని భాగ్యనగరంగా మార్చేందుకు మీ అందరితో కలిసి నడిచేందుకు వచ్చాను అని ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్య నాథ్ అన్నారు. నిజాం కు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమానికి, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏక్తా ద్వారా దేశంలో విలీనం చేసారు అని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్ దేశంలో విలీనం చేసేందుకు చేసిన ప్రయత్నాలను సర్దార్ వల్లభాయ్ పటేల్ విఫలం చేసి భారత దేశం లో విలీనం చేసారు అని చెప్పుకొచ్చారు. బిజెపి పార్టీ నగరాన్ని భాగ్యనగర్ంగా మార్చే శక్తి ఉంది అని ఆయన అన్నారు.

ఇప్పటికీ కొంతమంది నిజాం వారసులుగా అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ, అత్యాచారలకు పాల్పడుతున్న వారికి ఈ జి.హెచ్ యం సి ఎన్నికల ద్వారా బుద్ది చెప్పాలని ఆయన క్కోరారు. ఆర్టికల్ 370 ద్వారా కాశ్మీర్ ను దేశం నుండి ప్రత్యేక అధికారాలు కట్టబెట్టారు అని ఆయన వెల్లడించారు. అటువంటి ఆర్టికల్ ను రద్దు చేసి కాశ్మీర్ లో ప్రతి భారతీయుడు భూమిని కొనే హక్కును కల్పించారు అని చెప్పారు. అయోధ్యలో రామ మందిరం కొరకు అనేక మంది హైదరాబాదులో ముందుకు వచ్చారు అని ఆయన పేర్కొన్నారు.

అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ఎన్నో ఆటంకాలు కల్పించారు అని ఆయన విమర్శించారు. మోదీ రామ మందిరం నిర్మాణం కోసం భూమి పూజ చేసిన ఘనత దక్కించుకున్నారు అన్నారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన్ పేదలకు తెరాస అందించటం లేదు అని విమర్శించారు. యూపీలో మూడు ముప్పై లక్షల మందికి ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇల్లు అందించాము, తెరాస ఆరు ఏళ్ళలో ఎంతమందికి ఇండ్లు ఇచ్చారు అని ఆయన నిలదీశారు. ప్రధాన్ మంత్రి పేద రైతులకు ఆరువేల రూపాయలు అకౌంటలలో జమచేస్తుండగా.. వరద సహాయాన్ని అర్హులకు తెరాస అకౌంట్ ల ద్వార ఎందుకు అందించలేకపోయారని కెసిఆర్ ని ప్రశ్నిస్తున్నానన్నారు. నిజాం రూపంలో ఉన్న ఒక కుటుంబం హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నారని, దానిని సాకరం కాకుండా‌ చూడాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: