నివర్ తుఫాను ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇటు తెలంగాణ అటు తమిళనాడును అతలాకుతలం చేస్తుంది... ఒకవైపు చలి మరోవైపు వర్షం ఈ రెండు రెండు రాష్ట్రాల ప్రజల్ని తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నాయి...అయితే  తుపాన్ల  గండం ఇంకా పోలేదని ఇంకా మున్ముందు ఇంకా  వస్తాయని  వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు..వచ్చే నెలలో మరో రెండు తుఫాన్ తీవ్ర ప్రళయాన్ని సృష్టించబోతున్నాయని   వాతావరణ శాఖ ప్రకటించింది.. డిసెంబర్ మొదటి వరం లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తీవ్ర వాయుగుండం కాస్త తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ రాష్ట్రాలను  హెచ్చరిస్తుంది ..

ఈ తుపాన్లలో భాగంగా డిసెంబర్ మొదటి వారంలో బురేవి తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతుందని దీని  యొక్క ప్రభావం నివర్ తుఫాన్ కంటే అధికంగా ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు... ఈ బురేవి  తుఫాను తో పాటు బంగాళాఖాతంలో ఏర్పడే మరో అల్పపీడనంతో మరో తుపాన్ అయినా టకేటి తుఫాను కూడా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది..ఈ తుపాన్  ప్రభావంతో ఏపీ మరియు తమిళనాడు రాష్ట్రాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు ..  ఈ మూడు తుఫాన్ల వల్ల ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు వస్తాయని ..వీటి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ..

నివర్ తుఫాను పై ఈరోజు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మున్సిపల్ కమిషనర్లతో  వీడియో కాన్ఫరెన్స్  ఏర్పాటు చేసారు .. ఈ సందర్బంగా   ఆయన మాట్లాడుతూ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు..రానున్న రోజుల్లో మరో తుఫాను వచ్చే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ హెచ్చరికలను  దృష్టిలో పెట్టుకొని మున్సిపాలిటీ అధికారులందరూ పూర్తి అప్రమత్తతో ఉండాలని మంత్రి సూచించారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: