దీక్షా దివస్ సందర్బంగా అమరవీరుల స్తూపం కు నివాళ్ళు అర్పించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు  చేసారు. ఈ సందర్భంగా ఆయన బిజెపిపై మండిపడ్డారు. అమిత్ షా మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరు అని ఆయన పేర్కొన్నారు. మేము ఎవరికీ భయపడం అని స్పష్టం చేసారు. బీజేపీ భయపడుతోంది అందుకే కేంద్ర మంత్రులు వస్తున్నారు అన్నారు. కేసీఆర్ అన్నింటికీ తిరగాల్సిన అవసరం లేదు అని ఆయన పేర్కొన్నారు. వరదలొస్తే ఆయనే సహాయం ప్రకటించి పంపిణీ చేపించారు అని వెల్లడించారు.

ఇవి కేంద్ర మంత్రులు వచ్చి ప్రచారం చేసే ఎన్నికలా అని నిలదీశారు. ఎంతమంది వచ్చినా టిఆర్ఎస్ కు ఎలాంటి ఇబ్బంది లేదు అని ఆయన ధీమా వ్యక్తం చేసారు. కాగా నేడు ప్రచారంలో భాగంగా బిజెపి నుంచి కీలక నేత కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. హైదరాబాద్ లో సిఎం కేసీఆర్ ని టార్గెట్ గా చేసుకుని ఆయన మండిపడ్డారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో నేడు చివరి రోజు కావడంతో అన్ని పార్టీలు ప్రచారం దూకుడుగా చేసాయి.

మంత్రులు అందరూ కూడా తెరాస తరుపున ప్రచారం నిర్వహించారు. బిజెపి కీలక నేతలు అందరూ కూడా దూకుడుగా వ్యాఖ్యలు చేసారు. అమిత్ షా రావడంతో ఈ ఎన్నికలు చాలా హాట్ టాపిక్ గా మారాయి. ఆయనపై కాంగ్రెస్ నేతలు కూడా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసారు. రాజకీయంగా ఈ ఎన్నికల్లో ఎలా అయినా తెరాస పార్టీకి చుక్కలు చూపించాలి అని బిజెపి సిద్దం కాగా తెరాస నేతలు మాత్రం బిజెపి విషయంలో ఎక్కడా కూడా వెనక్కు తగ్గకుండా దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. మరి ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: