గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం చివరి రోజు బిజెపి నేతలు అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇక ప్రచారంలో పాల్గొన్న ప్రతీ అగ్ర నేతా కూడా దూకుడుగానే తెరాస సర్కార్ ని టార్గెట్ గా చేసుకుని విమర్శించారు. అటు తెరాస నేతలు కూడా ఘాటుగానే సమాధానం చెప్పారు. మంత్రులు అందరూ కూడా ప్రచారం దూకుడుగా చేసారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి అమిత్ షా వచ్చిన తర్వాత విమర్శలు కాస్త ఘాటుగా చేసారు. బండి సంజయ్, ధర్మపురి అరవింద్ అయితే విమర్శల్లో కాస్త ఘాటు పెంచారు అనే చెప్పాలి.

ఇక కేసీఆర్ బహిరంగ సభ తర్వాత మరింత వేగంగా విమర్శలు చేసారు. ఇక తాజాగా సిఎం కేసీఆర్ ని టార్గెట్ గా చేసుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. కల్వకుంట్ల కుటుంబం రోజులు లెక్క పెట్టుకోవాలని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీకి సైలెంట్ ఓటింగ్ జరగబోతోంది అని ఆయన పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ మేయర్ గా బీజేపీ వాళ్ళే ఉంటారు అన్నారు. కేసీఅర్ ఓటమి అయన ముఖంలో స్పష్టంగా కన్పిస్తుంది అని ఆయన వ్యాఖ్యలు చేసారు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణకు శాశ్వతం కాదు అన్నారు.

వరద బాధితులను పరామర్శించని ముఖ్యమంత్రికి కేంద్రాన్ని విమర్శించే హక్కు లేదు అని ఆయన స్పష్టం చేసారు.  బీజేపీ జాతీయ నాయకులపై టీఆర్ఎస్ నేతల విమర్శలను ఖండిస్తున్నాను అని ఆయన వ్యాఖ్యానించారు. అవినీతి, కుటుంబ రాజకీయాల పట్ల ప్రజలు విసిగిపోయారు అన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీని  కోరుకుంటున్నారు అని ఆయన విమర్శించారు. ప్రచారంలో మహిళలు, యువత బీజేపీకి అండగా నిలిచారు అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఇదే ఊపును కొనసాగిస్తాం అని ఆయన వ్యాఖ్యలు చేసారు. ఓటర్లు పోలింగ్ శాతాన్ని పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నాను అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: