ఎట్టకేలకు తెలుగు దేశం పార్టీ అధినేత తమ పార్టీకి ఓటు వేయాలని నిన్నట్విటర్ ద్వారా స్పందించాడు.  హైదరాబాద్‌ నగరానికి సర్వతోముఖాభివృద్ధికి పునాదులు వేసింది తెలుగుదేశం పార్టీయే అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజాశ్రేయస్సు పట్ల తమకున్న ఆకాంక్ష ఫలితమే హైదరబాద్‌ నగరం అని, సాఫ్ట్‌వేర్‌ రంగం ప్రస్థానం మొదలైందే హైటెక్‌ సిటీ నుండి అని ఆయన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

 హైదరబాద్ అభివృద్ది కి బాటలు వేసింది తామే అని మరొకసారి గుర్తుచేశాడు. ‘‘అవుటర్‌ రింగ్‌రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం.. ఇలా చెప్తూ పోతే హైదరబాద్ లో తాము అభివృద్ది చేసినవి ఎన్నో చెప్పాల్సి ఉంటుందని అన్నారు.మాటలకన్నా చేతల్లోనే అభివృద్ధిని చూపామని ఆయన ట్విటర్ ద్వారా తెలిపారు.తమ ప్రభుత్వానికి ఒటు వేసి గెలిపిస్తే హైదరబాద్ ను మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు.ఉపాధి కల్పన, సంపద సృష్టి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగాం.

ఎన్నో కుటుంబాల్లో వెలుగులు మా తెలుగుదేశానివే అని సగర్వంగా చెప్పగలం’’ అని పేర్కొన్నారు. ఆ వెలుగులు మళ్లీ రావాలంటే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుకు ప్రజలు ఓటు వేయాలని కోరారు. పై విధంగా ఆయన ట్విటర్ లో స్పందిస్తూ హైటెక్‌ సిటీలోని సైబర్‌ టవర్స్‌ భవనం ఫొటోను ఈ సందేశంతో చంద్రబాబు జతపరిచి పోస్ట్ చేశారు.ఐతే చంద్ర బాబు నాయుడు ఈ జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో ఏవిధమైన ప్రచారాలు చేపట్టలేదు.కారణాలు ఏవైనప్పటికి ఆయన ఎన్నికల ప్రచారం ముగిసే చివరి రోజు ట్విటర్ ద్వారా స్పందించి ఒటు వేయాలని కోరడం ఒకింత ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: