జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రారంభమైంది ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల తర్వాత ముగియనుంది ఈ క్రమంలోనె  సాయంత్రం 5 గంటల వరకు ఎంతో మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు కరోనా బాధితులకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అటు కరోనా బాధితులు కూడా జీహెచ్ఎంసీ ఎన్నిక లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు.



 ఇక ప్రస్తుతం అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది అనే విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఉదయాన్నే తక్కువ మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన సమయంలోనే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు అన్న విషయం తెలిసిందే. ఓటర్లు కూడా ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల వద్దకు క్యూ కడుతున్నారు. అయితే జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్లో భాగంగా దాదాపు 48 వేల మంది సిబ్బంది పోలింగ్లో విధులు నిర్వహిస్తున్నారు అన్న విషయం తెలిసిందే.



 కరోనా  వైరస్ వ్యాప్తి దృశ్య కరోనా  నిబంధనల మధ్య ప్రస్తుతం పోలింగ్ జరుగుతుంది.  ఎక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కువ మంది ఓటర్లు ఉండకుండా అధికారులు కూడా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గ్రేటర్ ఎన్నికల కోసం 28683 బ్యాలెట్ బాక్సులు ప్రస్తుతం వినియోగిస్తున్నారు అధికారులు. కాగా పోలింగ్ ముగిసిన వెంటనే ఈ బ్యాలెట్ బాక్సులను తిరిగి డి ఆర్ సి కేంద్రంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లకు తరలించనున్నారు. ఇక జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్లో భాగంగా.. ఇప్పటికే సిబ్బందికి అందరికీ కూడా శిక్షణ ఇచ్చారు ఎన్నికల అధికారులు. అంతేకాకుండా ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: