జిహెచ్ఎంసి ఎన్నికలు తెలంగాణ రాజకీయా ల్లో వేడి ని రాజేసాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జిహెచ్ఎంసి ఎన్నికల్లో విజయాన్ని అన్ని పార్టీలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకం గా తీసుకున్నాయి. ఎట్టి పరిస్థితులు జిహెచ్ఎంసి ఎన్నికల్లో విజయం సాధించి మేయర్ పీఠం దక్కించు కోవాలని అన్ని పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేశాయని అన్న విషయం తెలిసిందే. గ్రేటర్ ఎన్నికల కు సంబంధించిన షెడ్యూల్ విడుదల అయిన నాటి నుంచి కూడా అన్ని పార్టీల అభ్యర్థులు కూడా ముమ్మర ప్రచారం చేపట్టారు.



 ప్రచార రంగంలో దూసుకు పోతు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రస్థాయి లో కసరత్తు చేశారు అన్న విషయం తెలిసిందే. అంతేకాదు జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు భారీగానే ఖర్చు పెట్టారు అని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. ఇక అటు వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రచార రంగంలో దూసుకుపోతుంటే ఆయా పార్టీలకు చెందిన ప్రముఖులు కూడా రంగంలోకి దిగి అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అంటూ కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ రాజకీయాల చూపు  మొత్తం జిహెచ్ఎంసి ఎన్నికల వైపు మళ్ళింది.



 కాగా నేడు ఉదయం 7 గంటల నుంచి జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరుగుతుంది అనే విషయం తెలిసిందే. గ్రేటర్ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు అందరూ ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల వద్దకు క్యూ కడుతున్నారు. అయితే మొన్నటివరకు ప్రచారం నిర్వహించిన అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు ఓటర్లు. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరూ ఎంతగానో టెన్షన్ నెలకొంది. ప్రస్తుతం గ్రేటర్ ఓటర్ల అందరూ ఎవరి గెలిపించ బోతున్నారు అని అభ్యర్థులందరూ టెన్షన్ నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: