హైదరాబాద్ వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన గ్రేటర్ ఎన్నికల పోలింగ్ నేడు జరుగుతుంది.. ఎన్నో కట్టు దిట్టమైన చర్యల నడుమ పోలీసులు ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు. అల్లర్లు జరగడానికి ఆస్కారం ఉన్న ప్రాంతాలైన సులేమాన్ నగర్, రాజేంద్ర నగర్, అత్తాపూర్ వంటి ప్రాంతాల్లో పోలీసుల నిఘా భారీగా పెరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే రక్షణ బలగాలతో పాటుగా దాదాపు 50 వేల మంది పోలీసుల నడుమ ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి..



గెలుపు ఎవరిని వరిస్తుంది అనే ఆలోచనలు ఆయా అభ్యర్థుల్లో మొదలైంది .. ప్రచారం లో టీఆరెఎస్ పార్టీకి మద్దతు ప్రజల నుంచి భారీగానే లభించింది. ఇక ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మరో రెండు రోజుల్లో తేలనుంది.. ఇకపోతే ఎన్నికల గురించి  కొన్ని ఛానెల్స్ ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని తెరాస నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల ఒకవైపు జోరుగా సాగుతున్న కూడా మరోవైపు మాత్రం ఇలా తప్పుడు సమాచారం అందించడం భావ్యం కాదని  తెరాస కీలక నేతలు ఆరోపిస్తున్నారు.



అంతేకాదు.. అలాంటి ఛానెల్స్ పై నిఘా పెట్టాలని ఎన్నికల కమీషన్ కు వినతి పత్రాన్ని అందించారు..నిన్నటి నుంచి టీఆరెఎస్ కు వ్యతిరేకంగా ఛానెల్స్ ప్రచారం చేస్తున్నాయని వినతి పత్రంలో పేర్కొన్నారు.. రాజ్‌న్యూస్‌ ఛానల్‌ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు ఛానల్‌పై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోను భరత్‌కుమార్‌, కల్యాణ్‌రావు, రాము తదితరులు పాల్గొన్నారు. తమకు ఛానెల్స్ వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని, అధిష్టానం సలహా మేరకు ఫిర్యాదు చేసినట్లు వారు అన్నారు.. మరి సర్వే ప్రకారం ఈ ఎన్నికలు తెరాస పార్టీకి అనుకూలంగా ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: