కరోనా  వైరస్ వెలుగులోకి వచ్చి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందడానికి చైనా కారణం అనే విషయం తెలిసిందే. మొదట కరోనా వైరస్ గురించి అన్ని విషయాలు బయట పెట్టిన చైనా  ఆ తర్వాత మాత్రం మనిషి నుంచి మనిషికి ఇది వ్యాప్తి చెందుతుంది అని నిజాన్ని  అప్పటికే ప్రపంచం మొత్తం పాకి  పోయిన  నేపథ్యంలో నియంత్రణ చర్యలు చేపట్టే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది అనే విషయం తెలిసిందే. అయితే చైనా నుంచి ప్రపంచ దేశాలకు పాకేలా  చేసిన చైనా..  చైనా లో మాత్రమే ఎన్నో ముందు జాగ్రత్తలు పాటిస్తూ కరోనా వైరస్ వ్యాపించకుండా చేసుకుంది అనే విషయం తెలిసిందే. అయితే చైనాలో  వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ తో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతుంటే చైనా మాత్రం కరోనా వైరస్ రహిత దేశంగా మారిపోయింది.




 ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం చైనా డబుల్ గేమ్కు తెరలేపి కరోనా వైరస్ కి  చైనా కు సంబంధించింది కాదు అంటూ సంచలన ఆరోపణలు చేస్తోంది అన్న విషయం తెలిసిందే  ఈ క్రమంలోనే కరోనా వైరస్ అసలు వుహాన్  నగరం లో పుట్టలేదని... భారత్ లోని కరోనా వైరస్ కు సంబంధించిన మొదటి కేసు నమోదయింది అంటూ ఇటీవల ఆరోపించింది చైనా.  దీనికి సంబంధించి చైనా శాస్త్రవేత్తల దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి అంటూ సంచలన ఆరోపణలు చేసింది. చైనా చేసిన ఆరోపణలతో  ప్రపంచం కూడా ఒక్కసారిగా ఆశ్చర్య పోయింది అని చెప్పాలి. అయితే ఇటీవల చైనా ఆరోపణలపై భారత్ ఘాటుగా స్పందించింది.



 ఈ క్రమంలోనే చైనా శాస్త్రవేత్తలు చెప్పిన భారత శాస్త్రవేత్తలు ఘాటుగా స్పందించారు. కరోనా వైరస్ మొదటి కేసు బంగ్లాదేశ్ భారత్ లో వెలుగులోకి వచ్చాయి అంటూ చైనా చేస్తున్న ఆరోపణలు ఇచ్చిన నివేదికలు పూర్తిగా లోపభూయిష్టంగా ఉన్నాయి అంటూ స్పష్టం చేశారు భారత శాస్త్రవేత్తలు.  చైనా శాస్త్రవేత్తల యొక్క విశ్లేషణ అత్యంత ఘోరంగా ఉంది అంటు  భారత శాస్త్రవేత్తలు తెలిపారు. మనుషులు కోతులు సహచర్యం ఎక్కువ కాబట్టి భారత్ లో కరోనా వైరస్ కి మొదటి కేసు వెలుగులోకి వచ్చింది చైనా శాస్త్రవేత్తలు ఇచ్చిన నివేదిక అర్ధరహితం అంటూ భారత శాస్త్రవేత్తలు ఘాటుగా బదులిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: