అంతేకాదు రైతుల్లో వ్యవసాయ చట్టాల పై వ్యతిరేకత తీసుకొచ్చేందుకు పలు రాష్ట్రాలలో కాంగ్రెస్ భారీగా ర్యాలీలు కూడా చేపట్టింది అన్న విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ ర్యాలీలు చేపట్టిన చాలా రోజుల తర్వాత ప్రస్తుతం పంజాబ్లోని రైతాంగం మొత్తం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా... ఉద్యమ బాట పట్టారు అన్న విషయం తెలిసిందే... లక్షల సంఖ్యలో రైతులు ప్రస్తుతం వాహనాలతో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టడం తో ఎంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 8వ తేదీన రైతు సంఘాలు భారత్ బంద్ ప్రకటించాయి అన్న విషయం తెలిసిందే. రైతుల ప్రకటించిన భారత్ బంద్ కు పలు పార్టీలు మద్దతు ఇస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఈ నెల 8న రైతు సంఘాల ప్రకటించిన భారత్ బంద్కు టీఆర్ఎస్ కూడా మద్దతు ఇస్తున్నట్లు అటు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇటీవలే రైతు సంఘాల ప్రకటించిన భారత్ బంద్ కార్యక్రమానికి టీఆర్ఎస్ మద్దతు ఇవ్వడంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు టిఆర్ఎస్కు లేదు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ కమిటీల్లో రైతులకు న్యాయం చేస్తామని చెబుతూనే టి.ఆర్.ఎస్ నాయకులను నియమించుకుని రైతులకు అన్యాయం చేస్తున్నారని అంతేకాకుండా దళారులతో కుమ్మక్కయ్ రైతులకు గిట్టుబాటు ధర రాకుండామోసం చేస్తున్నారు అంటూ ఆరోపించారు బండి సంజయ్. అలాంటి టిఆర్ఎస్కు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదు అంటూ విమర్శలు గుప్పించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి